తమన్నా మనసు మార్చుకుందేమిటబ్బా ?

మిల్కి భామ తమన్నా అంటేనే .. గ్లామర్ గర్ల్ !! తనదైన అందంతో ఆకట్టుకుంటున్న తమన్నాకు ఈ మధ్య కాస్త వరుస పరాజయాలు టెన్షన్ పెట్టడంతో కాస్త బ్రేక్ తీసుకుని మళ్ళీ స్పీడ్ పెంచేసింది. దాదాపు పదేళ్లపాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తో ఆకట్టుకుంటున్న తమన్నా ఫోకస్ మారింది. హీరోయిన్ గానే కాదు అటు స్పెషల్ సాంగ్స్ లో కూడా దుమ్ము దులిపిస్తున్న తమన్నా తాజగా తీసుకున్న సంచలన నిర్ణయం సినీ రసిక హృదయాలను టెన్షన్ లో పడేసింది!! అదేమిటంటే .. ఇప్పటి వరకు తనదైన స్టయిల్ లో గ్లామర్ ను ఒలకబోస్తూ మత్తెక్కించే తమన్నా ఇకపై ఇలాంటి పాత్రల్లో అస్సలు నటించదట ?

అవును బాహుబలి, సైరా సినిమాల్లో కథలో మలుపుతిప్పే పాత్రల్లో నటించి ముఖ్యంగా నటిగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది.  అటు తమిళంలో కూడా అలాంటి పాత్రలవైపే మొగ్గు చూపిస్తుందట. ఈ మద్యే ఏరి కోరి మరి తెలుగులో తాప్సి లీడ్ రోల్ లో నటించిన ఆనందో బ్రహ్మ సినిమా తమిళ్ రీమేక్ లో నటించింది. పెట్రోమాక్స్ పేరుతొ విడుదలైన ఆ సినిమా అక్కడ బాగానే ఆడింది. సైరా సినిమాలో లక్ష్మి పాత్ర తనకు బాగా నచ్చిందట. అలాంటి గొప్ప పాత్రలే చేయాలనీ ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది తమన్నా? ప్రస్తుతం మేకర్స్ తనకు అలాంటి గొప్ప గొప్ప పాత్రలు క్రియేట్  చేస్తున్నారంటూ చెప్పింది.  ప్రస్తుతం బాలీవుడ్ లోకూడా ఛాన్సులు వస్తున్నాయని, మంచి పాత్రలోస్తేనే ఓకే చెబుతానని అంటోంది.