గోపీచంద్ కెరీర్ ఇక ముగిసినట్టే!?

హీరో గోపీచంద్ కెరీర్ ఇక ముగిసినట్టే!? అంటున్నారంతా. చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వరుసపెట్టి బోల్తా కొడుతుండటంతో కెరీర్ ఒడిదుడుకుల్లో పడింది. అతడి కెరీర్ వెనక్కు వెళుతోంది. ఒక్క హిట్టు కోసం చేస్తోన్న ప్రయత్నాలేవీ కలిసిరావడం లేదు. ఎన్నో ఆశలతో చేసిన చాణక్య సైతం నిరాశపర్చటంతో ఆలోచనలో పడ్డాడు గోపీచంద్. ఆరంభంలో హిట్లిచ్చి కెరీర్‌ను ట్రాక్‌లో పెట్టిన తేజను క్రైసిస్ నుంచి నిలబెట్టే బాధ్యత అప్పగించనున్నాడట. తేజతో చేసిన జయం, నిజం చిత్రాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న చిన్నా ఈసారి హీరోగా బ్రేక్ కోసం తేజతో సినిమా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు. తేజ సైతం గోపీచంద్ పట్ల ఆసక్తి చూపించటంతో -ఇద్దరి మధ్య ఒక విడత చర్చలు జరిగాయని తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో?!