గోపీచంద్- శ్రీవాస్‌ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ !

new movie will be comming from successful Gopichand, Srivas‌ combination

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హిట్ కోసం చాలా కాలం నుండి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ అనేది అందని ద్రాక్షలాగా ఆమడ దూరంలో ఉండిపోయింది. ఈ టాలెంటెడ్ హీరో నుండి హిట్ సినిమా కోసం సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్… సంపత్ నంది, మారుతి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ కెరీర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించేందుకు చూస్తున్నాడు. ఇదే క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ గోపిచంద్ అభిమానులకి సంతోషాన్నిస్తుంది.

గతంలో గోపిచంద్‏- శ్రీవాస్‌ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు హిట్ అయ్యాయి. ఈ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ కొత్త మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా గోపిచంద్ కెరీర్‏లో 30వ చిత్రంగా రానుంది. తాజాగా గోపిచంద్, శ్రీవాస్ కలయికలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‏ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ ని గమనిస్తే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌ లో ఈ మూవీ ఉండబోతుందని అర్ధమవుతుంది. ఈ మూవీ టైటిల్ మరియు నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.