అనన్యకు గోల్డెన్ ఛాన్స్!

సోషల్ కానె్సప్ట్‌తో తెరకెక్కిన హిందీ హిట్ ‘పింక్’నూ పవన్‌కళ్యాణ్ ఖాయం చేసుకున్న విషయమూ తెలిసిందే. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే సీరియస్ కోర్ట్ డ్రామా ఇది. దిల్‌రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ రీమేక్‌ను తెరకెక్కించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్స్ చివరి దశకు చేరడంతో ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లేందుకూ రంగం సిద్ధమవుతుంది. కాగా కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిల్లో ఓ పాత్రకు మంచి పెర్ఫార్మర్‌ను దిల్ రాజు టీం ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె అనన్య. ‘మల్లేశం’ చిత్రంలో ప్రియదర్శి సరసన కనిపించిన అనన్య తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రాణమే పోసింది. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ నటిస్తున్న పింక్ చిత్రంలో నటించే అవకాశం అనన్యకు దక్కడంతో దిల్‌రాజ్ టీం ఎంపిక సరైనదేనన్న టాక్ వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే హీరోయిన్‌గా మల్లేశం చిత్రంతో మెప్పించిన అనన్య, ఇప్పటికే రెండు చిత్రాలే చేసింది. ఆ రెండో చిత్రమే ప్లేబ్యాక్. 1993నాటి కాలం అమ్మాయిగా నటించింది. ఇప్పుడు పవన్ సినిమాలో చాన్స్ దక్కించుకోవడంతో అనన్యకు గోల్డెన్ ఛాన్స్ లభించినట్లే అంటున్నారు అంతా!