తిరుపతి ఉప ఎన్నిక: వైఎస్‌ జగన్‌ రాంగ్‌ స్టెప్‌ వేసినట్టేనా?

ysrcp shocking planning on tirupati by elections
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి వుంది. సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కరోనా కారణంగా మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరైంది. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్‌, తిరుపతి ఉప ఎన్నికపై నోటిఫికేషన్‌ ఇవ్వనుందన్న ప్రచారం నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమైపోయాయి. ఇటీవలే టీడీపీ, తమ అభ్యర్థిని ప్రకటించేసింది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ysrcp shocking planning on tirupati by elections
ysrcp shocking planning on tirupati by elections


వైసీపీ షాకింగ్‌ ప్లానింగ్‌..
బల్లి దుర్గాప్రసాద్‌ తనయుడు కళ్యాణ్‌ చక్రవర్తిని బరిలోకి దింపాలని తొలుత వైసీపీ భావించింది. అయితే, రాజకీయంగా అంత అనుభవం లేకపోవడం సహా అనేక కారణాలతో కళ్యాణ్‌ చక్రవర్తిని వైఎస్‌ జగన్‌ ఒప్పించారు.. వేరే అభ్యర్థికి టిక్కెట్‌ ఇచ్చే విషయమై. బల్లి దుర్గా ప్రసాద్‌ కుటుంబంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంతనాలు జరిపారు.. కళ్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీగా ఛాన్స్‌ ఇస్తామని చెప్పారు. దాంతో, వైసీపీ నుంచి ఎవరు అభ్యర్థిగా నిలబడినా గెలిపిస్తామంటూ కళ్యాణ్‌ చక్రవర్తి మీడియా ముందుకొచ్చి చెప్పారు.. ఎమ్మెల్సీ హామీ ఇచ్చినందుకు జగన్‌కి కృతజ్ఞతలూ తెలిపారు.
అందరికన్నా జోరు మీదున్న బీజేపీ..
తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ చాలా జోరు ప్రదర్శిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయంగా కాక మొదలైందంటే అది బీజేపీ పుణ్యమే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో సమీక్షించారు.. బీజేపీ ఏపీ అధ్యక్షుడూ తిరుపతికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల్ని సమీక్షించిన విషయం విదితమే. గ్రౌండ్‌ లెవల్‌లో బీజేపీ అనధికారికంగా ఇప్పటికే ప్రచారం ప్రారంభించేసినట్లు కనిపిస్తోంది.
జనసేన అలా, కాంగ్రెస్‌ ఇలా..
కాంగ్రెస్‌ పార్టీ ఏదో ఆరాటంతో పోటీ చేయాలి తప్ప, ఆ పార్టీకి ప్రస్తుతం అంత సీన్‌ లేదు ఆంధ్రప్రదేశ్‌లో. జనసేన విషయానికొస్తే, బరిలోకి దిగాలనే ఆలోచన వున్నా.. మిత్రపక్షం బీజేపీ జోరు నేపథ్యంలో ‘గ్లాసు పార్టీ’ వెనక్కి తగ్గక తప్పేలా లేదు. బీజేపీ అభ్యర్థికే జనసేన మద్దతివ్వాల్సి వుంటుంది. దాంతో జనసైనికుల్లో కొంత నిస్తేజం స్పష్టంగా కనిపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నిక విషయమై వైసీపీ రాంగ్‌ స్టెప్‌ వేసిందా.? బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి టిక్కెట్‌ ఇస్తే, సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయ్యేది. ఆ కుటుంబానికి కాకుండా మరో అభ్యర్థిని అధికార పార్టీ దింపడమంటే.. అది ఖచ్చితంగా విపక్షాలకు అడ్వాంటేజ్‌ అవుతుంది. కానీ, బలమైన అభ్యర్థిని దింపడం ద్వారా రికార్డు స్థాయి విజయం సాధించాలనే వైఎస్‌ జగన్‌ వ్యూహం వర్కవుట్‌ అయితే.? ఇదే, ఈ నమ్మకంతోనే వైఎస్‌ జగన్‌ కరినమైన నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలేమో.!