AP Government: ‘బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?’.. ఏపీలో ఈ ప్రశ్న ఎవరిని అడగాలి..?

AP Government: ఏపీలో రాజకీయాలు ఎన్నికల సమయాలతో సంబంధం లేకుండా.. పండుగలు, పబ్బాలు అనే తారతమ్యాలకు తావు లేకుండా.. నిత్యం రగులుతూనే ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా తెరపైకి వచ్చిన రెండు వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. అందులో ఒకటి.. “ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటారా?.. బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా..?”.. మరొకటి… “మెడికల్ కాలేజీలకు పీపీపీ వద్దు కానీ.. విమానాశ్రయం ముద్దా”! ఈ సందర్భంగా నెట్టింట పలు ప్రశ్నలు దర్శనమిస్తున్నాయి!

పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడానికి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. ధనవంతులు తిరిగే విమానాలు ఉండే విమానాశ్రయాలు ఒకటేనా..?

మోకాలికీ బోడు గుండుకీ ముడిపెట్టినట్లుగా.. అల్ రెడీ ప్రజాధనంతో నిర్మించేసిన ఆసుపత్రులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం.. కొత్త విమానాశ్రయాలను పీపీపీ విధానంలో నిర్మించడం ఒకటేనా..?

భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 15 వేల ఎకరాల భూమి కావాలని ఒకరంటే.. 2,700 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్‌ పోర్టు నిర్మాణ ప్రాజెక్టు చేపట్టిన విషయంలో ఏది కరెక్ట్..?

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్‌ అనే విమర్శకు సమాధానాలు ఎక్కడ..? ఇవే విమర్శలు నిర్మించిన ప్రభుత్వంలో ఈ ‘స్కామ్’ విమర్శలు ఎందుకు రావడం లేదు.. సరికదా ఓన్లీ క్రెడిట్ గేమ్ మాత్రమే ఎందుకు నడుస్తోంది..?

ప్రస్తుతం ఏపీలోని మెజారిటీ ప్రజానికం మదిలో ఈ ప్రశ్నలు మెదులుతుంటే.. మరికొంతమంది మెదళ్లను మాత్రం తొలిచేస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే.. నిన్నటివరకూ ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం, అందులో జరగబోయే అతిపెద్ద స్కామ్ కు సంబంధించిన విషయాలపైనే జరిగితే… గత రెండు రోజులుగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం విషయంలో క్రెడిట్ గేమ్ నడుస్తుంది.

దీనిపై ఇప్పటికే సవివరంగా స్పందించిన జగన్… భోగాపురం ఎయిర్‌ పోర్టుకు మా హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని.. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశామని.. 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశానని. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్‌ అవుతుందని ఆ రోజు కేంద్రంలోని పెద్దలు, రాష్ట్ర ప్రజానికం ముందు మీటింగ్‌ లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోందని జగన్ చెబుతున్నారు.

పైగా… 2024 తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు సమయం అవుతున్నా… దానికి సంబంధించిన రోడ్డు పనులను చేయకుండా చంద్రబాబు గాలికొదిలేశారని.. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదని.. చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి మాత్రం తామే విమానాశ్రయాన్ని నిర్మించినట్లు బిల్డప్‌ ఇస్తారని ఎద్దేవా చేస్తూ.. వీళ్లు కనీసం ఒక్క అనుమతి అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు జగన్!

జగన్ ఈ స్థాయిలో వివరణ ఇస్తూ, సాక్ష్యాలతో క్లారిటీ ఇస్తూ ఉన్నవేళ.. ప్రభుత్వం సరైన రీతిలో స్పందిస్తుందని, ప్రజలకు మరింత స్పష్టత ఇస్తుందని చాలా మంది భావించి ఉండోచ్చు! అయితే… ఈ సమయంలో.. “బెంగళూరు జగన్‌ స్వస్థలం కాదు. కానీ.. అక్కడికి పదేపదే వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి?” అని టాపిక్ డైవర్ట్ వ్యాఖ్యలు ఒకరు చేస్తే… “పీపీపీ అంటే ఆయనకు (జగన్) అర్థం కావట్లేదు.. మెడికల్‌ కళాశాలలు ఆ విధానంలో నిర్మిస్తామంటే వద్దని బెదిరిస్తున్నారు..” అని మరొకరు అన్నారు.

అనంతరం… “పీపీపీలో మెడికల్‌ కళాశాలలు వద్దు.. పీపీపీలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం మాత్రం ముద్దా?” అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. అనంతరం… గత ప్రభుత్వంలో తిరుమలలో నెయ్యిని కల్తీ చేశారని.. రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టారని గతంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మరొకరు వ్యాఖ్యానిస్తున్నారు! ఈ నేపథ్యంలోనే… ‘బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?’.. అనే ప్రశ్నను ఏపీ ప్రజానిక ఎవరిని అడగాలి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు!! జరుగుతున్న చర్చ ఏమిటి.. ప్రజలకు ఇవ్వాల్సిన వివరణ ఏమిటి.. ఇస్తున్న రియాక్షన్ ఏమిటి.. అనే కామెంట్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు!

బాబు సీమ ద్రోహి || Analyst Ks Prasad About Chandrababu Over Rayalaseema Lift Irrigation Project ||TR