నన్ను బతికించడంటూ వేడుకుంటున్న అమ్మాయి

ఆ అమ్మాయి ఎంత ముద్దుగా ఉందో… అందరిలాగే ఆటలాడాలని , చదువుకోవాలని తనకి ఓ జీవితం కావాలని కోరుకుంటోంది. కానీ విధి తనను వక్రీకకరిచింది. అనారోగ్య సమస్య వెంటాడుతోంది. నాక సహాయం చేసి నన్ను బతికించడి అంటూ వేడుకుంటోది…
నాకు బతకాలని ఉంది. కానీ నా పరిస్థితి దినదిన గండంగా మారింది. ఏడాది నుంచి నా ఆరోగ్యం కబళించిపోతుంటే నా కుటుంబ సభ్యులు వైద్యం చేయించలేక తల్లడిల్లిపోతున్నారు. చికిత్సకు 50 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు అంటున్నారు. దయచేసి నన్ను ఆదుకోండి… అంటూ ఒంగోలుకు చెందిన సొహెల్ అనే బాలిక తన ఆవేదనను వ్య్తక్తం చేస్తోంది. ఎవరీ సొహెల్ … ఏమీటీ ఆమె దీనగాథ…ఇది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

          

ఒంగోలు జిల్లాకు చెందిన మొయిన్ అహ్మద్ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో సంతానమైన సొహైల్ కు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంగానే ఉండేది. వైద్యులు పరీక్షించి పలు మందులు రాసేవారు. 9వ తరగతి వరకు బడికెళ్లింది. ఆ తర్వాత పరిస్థితి మరింత నీరసిస్తుండటంతో బడికి వెళ్లలేక మానేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ తాను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ నుంచి విముక్తి పొందటానికి బొమ్మలను తయారు చేస్తూ భగవంతుడి కృప కోసం ఎదురుచూస్తోంది. తండ్రి చికెన్ పకోడి బండి నిర్వహిస్తుండగా, సోదరుడు వెబ్ డిజైనింగ్ చేస్తూ ఇప్పుడిప్పుడే కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.

ఏడాది క్రితం సొహెల్ పరిస్థితి విషమంగా ఉండటంతో అపోలో హస్సిటల్ లో చూపించారు. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెకు మూడు రంధ్రాలు ఉన్నట్టు నిర్ధారించారు. పల్మనరీ హైపర్ టెన్షన్, వెంట్రీక్యులర్ సెప్టిన్ డిఫెక్ట్, యెజెనెమెంజర్స్ సిండ్రోమ్ అనే మూడు సమస్యలు ఆమె గుండెకు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఆమె బతకాలంటే గుండె మార్పిడి తప్పని సరి అని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కు ముందు 2 లక్షలు, ఆపరేషన్ కు 30-35 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారట. మొత్తంగా 50 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యవర్గాలు తెలిపాయని సొహెల్ ఆవేదన చెందుతోంది. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని తనకు బతకాలని ఉందని సొహెల్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు సహాయం చేయదలచిన వారు ఎస్ బీ ఐ అకౌంట్ నంబర్ 20351379362 షేక్ అతికూర్ , ఐఎఫ్ ఎస్ సీ కోడ్ sbin0010311 కు సహాయం చేసి ఆదుకోవాలని సోహెల్ విన్నవించుకుంటోంది. పూర్తి వివరాలకు 99492 99089 ను సంప్రదించవచ్చని కుటుంబసభ్యలు వేడుకుంటున్నారు.

సోహెల్ దీనగాథ తెలుసుకున్న ఒంగోలు సిరి ఈవెంట్స్ వారు స్పందించారు. వారు హీరో సంపూర్ణేష్ బాబును సంప్రదించగా ఒంగోలు ఉచితంగా ఈవెంట్ నిర్వహించి వచ్చే నగదును సొహెల్ కు కేటాయిస్తానన్నారు. ఆగష్టు 26న రక్షాబంధన్ రోజున బుల్లితెర కళాకారులతో నవ్వుల హరివిల్లు కార్యక్రమం చేసి వచ్చే డబ్బును సొహెల్ కు ఇవ్వనున్నట్టు వారు తెలిపారు. ముద్దుగా పైకి కనపడినా లోపల ఎంతో బాధ అనుభవిస్తున్న సొహెల్ కు సహాయం అందించటానికి ఒంగోలు ప్రజలు ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.