నిలబడని కేసులని ఎలా అనగలం.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయ్యారంటేనే, అది చాలా చాలా పెద్ద విషయం. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు, అరెస్టు నుంచి తప్పించుకోలేకపోవడమే పెద్ద ఆశ్చర్యం. బెయిల్ కోసం ఇప్పటిదాకా ప్రయత్నించకపోవడం మరో వింత.!

కేసుల్ని పూర్తిగా కొట్టేయాలని చంద్రబాబు లీగల్ టీమ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిన సంగతే.! అసలు ఇది కేసే కాదు.. అని తొలుత టీడీపీ లైట్ తీసుకుంది. అంత పెద్ద కేసు కాకపోతే, చంద్రబాబు ఎలా రిమాండుకి వెళతారు.?

అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికీ, న్యాయమూర్తికీ వైఎస్ జగన్ సర్కారు భద్రతని పెంచిందంటే.. విషయం చిన్నది కాదు.. చాలా చాలా పెద్దదే.! ప్రముఖ న్యాయవాది సిద్దార్ధ లూద్రాని టీడీపీ రంగంలోకి దించిందంటే, కేసు చిన్నదెలా అవుతుంది.?

టీడీపీ మాటలకీ, టీడీపీ చేతలకీ అస్సలు పొంతన వుండటంలేదు. నిజానికి, ఈ కేసు ముందు ముందు మరింతగా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే అవకాశాల్లేకపోలేదు. చంద్రబాబుని రాజకీయంగా ఈ కేసు ముప్పు తిప్పలు పెట్టేయనుంది. అదే జరిగితే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసినా, గెలిచినా ఉపయోగం వుండకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

‘ఇదేమీ చిన్న కేసు కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్లు తేలికైనది అస్సలే కాదు..’ అన్ని ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడి అభిప్రాయం. ‘ఆయన్ని ఆయన కాపాడుకోలేకపోయారంటే, చంద్రబాబుకే అర్థమయి వుంటుంది ఇదెంత క్లిష్టతరమైన కేసు అనేది..’ అంటూ ఓ టీడీపీ నేత ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్రతినిథుల వద్ద వాపోయాడట.

అంటే, చంద్రబాబు మీద ఈ కేసు విషయమై టీడీపీలోనే ఆశసలు సన్నగిల్లుతున్నాయన్నమాట.