Anchor Shyamala: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు పూర్తిగా పక్కదారి పట్టాయని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అప్పులపైనే ప్రభుత్వ దృష్టి.. గత ప్రభుత్వ హయాంలో ‘సోమవారం – పోలవరం’ అనే నినాదం బలంగా వినిపించేదని శ్యామల గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత పాలనలో ఆ ‘సోమవారం’ కాస్తా సంతకు పోయిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ‘మంగళవారం – అప్పుల వారం’గా మారిపోయిందని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులను విస్మరించి, కేవలం అప్పులు చేయడంపైనే దృష్టి సారించిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
CPI Narayana: ఐబొమ్మ రవిని కాదు.. సినిమా మాఫియాను ఉరితీయాలి: సీపీఐ నారాయణ
Harish Rao: ”గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ”: కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్ రావు ఫైర్
ఎంపీలకు సవాల్.. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూటమి ఎంపీలకు శ్యామల సవాల్ విసిరారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. వంటి అంశాలపై పార్లమెంటులో పోరాడతారో లేదో తేలాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ మేరకు తన ట్వీట్‌లో “#failedkutami” అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేస్తూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను ట్యాగ్ చేశారు.

