అసలు కత్తి కార్తికకు దుబ్బాకకు సంబంధం ఏమిటి. ఏ సంబంధం లేకుండా ఆమె దుబ్బాక ఉపఎన్నికల బరిలో ఎందుకు దిగింది. ఓ మామూలు మాజీ టీవీ యాంకర్ కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అంతశక్తి ఎక్కడిది. ప్రజాసేవ ముసుగులు రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్తున్న వాళ్ల జాబితాలో కత్తికార్తిక కూడా చేరిపోయిందా. ఆమె పొలిటికల్ ఎంట్రీని పరిశీలిస్తే పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్యే అమీన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో మధ్యవర్తిత్వం వహించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తెరపై కత్తి కార్తిక పాత్ర దారి అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీ వెనక ఉన్న సూత్రసాధారులు ఎవరనేది ఆసక్తిగా మారింది.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కాస్తో కూస్తో పాపులర్ అయిన ఈమె… ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న తీరుగా వ్యవహరిస్తోంది. కాస్తో పాపులారిటీ ఉన్నప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కాస్తో కూస్తో పోగేసుకోవచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సాయంతో ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అడ్వకేట్ సాయంతో కొంత మంది పెద్దలను అప్రోచ్ అయి వాళ్లిచ్చిన ఆర్థిక సాయంతో ఎన్నికల బరిలోకి దిగిందని టాక్. నలుగురు బౌన్సర్లను పెట్టుకొని మరీ బెంజ్ కార్లో తిరుగుతూ కత్తి కార్తిక ఎన్నికల ప్రచారం చేస్తోంది. మరి ఇంత డబ్బు ఆమెకు ఎక్కడిదనే టాక్ ఇప్పుడు పొలిటకల్ సర్కిల్స్ లో వినబడుతోంది. దుబ్బాక ఉపఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈమె ఖర్చు కూడా బాగానే పెడుతోంది. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే కట్టమంచి రామలింగా రెడ్డి చనిపోయిన వెంటనే దుబ్బాకలో వాలిపోయిన ఆమె ఇక్కడ ఓ ఇళ్లు కూడా తీసుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆమెపై దాడి కూడా జరిగింది. మరి ఆ దాడి ఎవరు చేయించారు ఎందుకు చేయించారు అనేది పక్కన పెడితే ఈ దాడితో ఆమెకు కొంత ప్రచారం వచ్చింది. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి ప్రచారం చేస్తున్నారు.
టీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ హోరాహోరిగా తలపడుతున్నాయి. మూడు పార్టీలు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నాయ. హరీష్ రావు, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి లాంటి ఉద్ధండులు తమ తమ పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరి ఇంత గట్టి పోటీలో కత్తి కార్తిక ఏం చేయగలదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి దుబ్బాకలో ఇళ్లు తీసుకున్నంత మాత్రానా ఓట్లు రాలతాయా అనేది పెద్ద ప్రశ్న.
సాధారంగా ఎన్నికలు అంటే బలమైన అభ్యర్థులతో పాటు డమ్మీ అభ్యర్థులు కూడా బరిలో ఉంటారు. ఓట్లు చీల్చేందుకు పార్టీలే కొంత మందితో నామినేషన్ వేయిస్తాయి. కాని ఈ క్యాటగిరీల్లో వేటికీ చెందరు కత్తి కార్తిక. మరి ఇంలాంటప్పుడు ఆమె దుబ్బాకకు ఎందుకు వచ్చినట్లు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పొలిటికల్ ఎంట్రీతో ఫేమస్ అయితే ఆతర్వాత ఈమె సాయంతో ల్యాండ్ సెటిల్ మెంట్లు చేయవచ్చనే కొంత మంది పక్కా స్కెచ్ తో ఆమెను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
ముందు ల్యాండ్ మాఫియా బరిలోకి దిగి బెదిరిస్తుంది. అప్పటికీ పనికాకపోతే ఫేమస్ అయిన ఈ సదరు నేతతో ప్రజాపోరాటం పేరుతో హడావిడి చేస్తారు. దీంతో గుట్టుగా సాగే వ్యవహారం బజారున పడుతుందనే భయంతో దెబ్బకు సదరు ల్యాండ్ సెటిల్మెంట్లు అవుతాయనే ఆశతోనే కొంత మంది పెద్దలు ఈమెను ఉపఎన్నికల బరిలోకి దించి ఖర్చులు భరిస్తున్నట్లు సమాచారం. అయితే రాబోయే రోజుల్లో కత్తి కార్తీక ప్రచారం, ఆమె తీసుకునే పొలిటికల్ స్టెప్పులను బట్టి ఆమె వెనుక ఎవరు ఉన్నారనేది తెలియనుంది.