బీజేపీ, మజ్లిస్‌.. ప్రత్యర్థులా.? తెరవెనుక మిత్రులా.?

what's going on GHMC municipal elections's?
రాజకీయాల్లో నిన్న తప్పు, నేడు ఒప్పు. నిన్నటి స్నేహితుడు, నేడు శతృవైపోతాడు. సందర్భానుసారం శతృవులు మిత్రులైపోతారు. మిత్రులుగా వున్నవారు, శతృవులుగా మారిపోతారు. శతృవు.. అనడం కంటే, రాజకీయ ప్రత్యర్థి అనడం కరెక్ట్‌. బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ సీట్లు ఎందుకు పెరిగాయి.? అన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనూహ్యంగా బీహార్‌లో మజ్లిస్‌ పార్టీకి ఐదు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఇది రాజకీయ విశ్లేషకుల్ని ఆలోచనలో పడేసింది. జెడియు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికార పీఠం ఎక్కడ వెనుక, మజ్లిస్‌ పార్టీ పరోక్ష సాయం వుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అదెలా సాధ్యం.? అన్నదే ఇక్కడ అసలు చర్చ.
what's going on GHMC municipal elections's?
what’s going on GHMC municipal elections’s?
ఆ ఓటు బ్యాంకు చీల్చుతోన్న మజ్లిస్‌
మైనార్టీ ఓటు బ్యాంకుని చీల్చడంలో మజ్లిస్‌ పార్టీ గత కొన్నేళ్ళుగా సక్సెస్‌ అవుతోంది. ఇప్పుడంటే బీహార్‌ గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో మహారాష్ట్రలోనూ అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా వేలు పెట్టలేదుగానీ, పరోక్షంగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సహకరించింది మజ్లిస్‌ పార్టీ. ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక విషయంలోనూ మజ్లిస్‌ సాయం భారతీయం భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా బాగానే సాగిందని అంచనా వేస్తున్నారు. మైనార్టీ ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ మధ్య చీలిపోవడంతో, బీజేపీకి దుబ్బాకలో విజయం సులువుగా మారిందట.
గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో ఏం జరుగుతుంది.?
హుటాహుటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మిత్రపక్షం (బయట నుంచి మద్దతిస్తోన్న పార్టీ) మజ్లిస్‌ని పిలిచి, గ్రేటర్‌ ఎన్నికలపై చర్చించారట.. అదీ దుబ్బాక ఎఫెక్ట్‌ వల్లనేనని అంటున్నారు. ఇందులో నిజమెంతోగానీ, గ్రేటర్‌ విషయంలో మజ్లిస్‌కి కొన్ని లెక్కలున్నాయి. ఆ పార్టీకి స్పష్టంగా కొన్ని చోట్ల గెలుపు దక్కుతుంది. మిగతా చోట్ల టీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చినా, అది కొంత వరకే పరిమితం. ఈ విషయమై కేసీఆర్‌ మరింతగా మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో చర్చలు రానున్న రోజుల్లో జరపనున్నారట.
మజ్లిస్‌ని ఎంత విమర్శిస్తే బీజేపీకి అంత లాభమట.!
మజ్లిస్‌ని విమర్శించడం ద్వారా బీజేపీ లాభపడుతోన్న మాట వాస్తవం. అందుకే, బీజేపీ ఈ విషయంలో అస్సలేమాత్రం తగ్గడంలేదు. సిద్ధాంతపరంగా రెండు పార్టీల మధ్యా వైరం వున్నా, ఈక్వేషన్స్‌ మార్చేయడంలో మజ్లిస్‌ వ్యవహరిస్తున్న తీరుతో లోలోపల బీజేపీ సంతోషంగానే వున్నట్లు కనిపిస్తోంది. సాధారణ ప్రజానీకానికే బీజేపీ, మజ్లిస్‌ ప్రత్యర్థులా.? తెరవెనుక మిత్రులా.? అన్నది అర్థం కావట్లేదు.