Narendra Modi: మోదీ నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉండబోతోంది?

ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటిస్తూనే… మరోవైపు లైన్అఫ్ కంట్రోల్ వెంబడి మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతోన్న పాకిస్థాన్‌పై భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాక్ విమాన స్థావరాలను నేలమట్టం చేసిన భారత్, తదుపరి దశలో న్యూక్లియర్ సైట్స్‌పై కూడా దృష్టి పెట్టిందన్న అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో అత్యంత కీలక భేటీ జరిపినట్టు సమాచారం.

పాక్ నాటకీయంగా కాల్పుల విరమణ ప్రతిపాదన చేసి అంగీకరించినా… దానిని గౌరవించని పద్ధతిలో మళ్లీ కాల్పులు జరపడంతో, భారత్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. ఇకపై దాడులు ఉగ్రవాదుల స్థావరాలకే పరిమితమవు, ఆ మద్దతుదారుల ప్రధాన కేంద్రాలే లక్ష్యమవుతాయని తెలుస్తోంది. పాక్ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారత్ చర్చలు జరుపుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఒత్తిడి కనిపించడంతో, భారత్ కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కానీ త్రివిధ దళాలు మాత్రం స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నాయన్నదే రక్షణ వర్గాల స్పష్టం. పాక్ నుంచి మరో దెబ్బ వస్తే… ఈసారి ప్రతిస్పందన మిస్‌లు కాదు, డైరెక్ట్ పంచ్ అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జైషే మహ్మద్ వంటి సంస్థల ప్రధాన కేంద్రాలే ఇక లక్ష్యమవుతాయని సంకేతాలు వస్తున్నాయి.

భారత్ వైఖరి స్పష్టంగా మారింది. ఇకపై దాడి జరిగితే, కేవలం ప్రతీకారం కాదు… వ్యూహాత్మకంగా శత్రు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పని చేయనుంది. ఈ తరహా దూకుడు పాక్‌కు తీవ్రస్థాయిలో నష్టాన్ని కలిగించనుందని, ఇప్పటికే పాక్ వైమానిక దళం పరంగా సంక్షోభంలో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశ్న ఒక్కటే.. పాక్ మరోసారి రెచ్చిపోతే, భారత్ అణు కేంద్రాలే లక్ష్యంగా దూకుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Casting couch under the guise of UPSC coaching ! Girls are being exploited brutally!! | TeluguRajyam