మొత్తానికి సూపర్‌స్టార్ రజని, శంకర్‌ల విజువల్ వండర్ 2.0 విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుని వసూళ్లు రాబడుతుంది. సూపర్‌స్టార్ రజనీ సినిమాకు పోటీ పడటం అనవసరకం అనుకుని చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించుకుని, తరువాత మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే 2.0 ఎప్పుడు థియేటర్లకు వస్తుందన్నది నెల క్రితం వరకూ కన్ఫ్యూజింగానే ఉండటంతో, అప్పటి నుంచీ చాలా సినిమాలు వెనక్కి జరుగుతూనే వచ్చాయి.
దాంతో 2.0 కు రూట్ క్లియర్ చేస్తూ ఆగిన సినిమాలు, వాయిదా పడిన సినిమాలు ఇప్పుడు థియేటర్ల వద్ద క్యూ కట్టనున్నాయి. ఒకరంగా చెప్పాలంటే డిసెంబర్ నెల మొత్తం సినిమా అభిమానులకు పండగలా మారింది. ఈ ఒక్క ఈనెలలోనే దాదాపు 20కి పైగా చిన్న, పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో ఈ వారం రిలీజైన సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉంది? ఏది హిట్టు? ఏది ఫ్లాఫ్ ? అని విశ్లేషిస్తే .. ఈ శుక్రవారం ఏకంగా డజను సినిమాలు రిలీజయ్యాయి. తెలుగులో పడి పడి లేచే మనసు, అంతరిక్షం, కెజిఎఫ్, మారి 2 చిత్రాలు రిలీజయ్యాయి. స్ట్రెయిట్ సినిమాలు పడి పడి లేచే మనసు, అంతరిక్షం, అలాగే డబ్బింగు కెజిఎఫ్ గురించి బాగానే చర్చ సాగింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఏదీ మంచి టాక్ తెచ్చుకోలేకపోయింది. ఉన్నంతలో కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అన్న టాక్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ హిట్టు అన్న గొప్ప టాక్ దేనికీ రాలేదు.
అటు తమిళంలో మాత్రం ఎనిమిది సినిమాలు రిలీజైతే వాటిలో ఒకటి మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి నటించిన `సీత కత్తి` చిత్రం విజయ్ పెర్ఫామెన్స్ వల్ల నిలబడిందని అంటున్నారు. అందులో భారతీయుడు సేనాపతి తరహా లుక్‌తో విజయ్ సేతుపతి ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసి బంపర్ హిట్ చేశారు. ఐశ్వర్యా రాజేష్ నటించిన కనా చిత్రం జస్ట్ ఓకే అన్న టాక్ వినిపించింది.
బాలీవుడ్‌లో షారూక్ నటించిన `జీరో` అత్యంత క్రేజీగా రిలీజైనా, ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. జీరో రెండో రోజే వసూళ్లు డ్రాప్ అయ్యిపోయింది. ఇక ధనుష్ నటించిన `మారి-2` తెలుగులో ప్రమోషన్ పెద్దగా లేక ఎవరికీ తెలీదు.