మొన్నీమధ్యనే తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన ఓ పెళ్ళి వ్యవహారం.. ఇంకా హాట్ టాపిక్‌గానే వుంది. ఎందుకిలా.? అంటే, తమ ప్రేమ గురించి సదరు సినీ నటుడు మీడియాకి దఫ దఫాలుగా వివరాలు అందిస్తున్నాడు.
కాదు కాదు, మీడియాలో తన ప్రేమ కథని చెప్పించుకుంటున్నాడు. ఇదేం ప్రేమకథ.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నా, డోన్ట్ కేర్.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.
ఇంతకీ, సినిమాల సంగతేంటయ్యా.? అంటే, ఏవో మాటలు చెప్పి ఊరుకుంటున్నాడు.. మళ్ళీ పెళ్ళి ముచ్చట్లే చెబుతున్నాడు. పెళ్ళి మాత్రం అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్నాడు.. అదీ తక్కువ ఖర్చుతోనే.
అందుకే, పబ్లిసిటీ కోసం చాలా చాలా ఖర్చు చేస్తున్నాడట. ఈ పెళ్ళి గోల మేం వినలేకపోతున్నాం మొర్రో.. అని కొందరు సినీ మీడియా ప్రతినిథులు చెవులు కొరుక్కుంటున్నారు.