బిగ్ బ్రేకింగ్: కర్ణాటకలో తెరపైకి ఎస్సీ ముఖ్యమంత్రి!

కర్ణాటకలోని కాంగ్రెస్ కార్యకర్తలకు గెలిచిన ఆనందం లేకుండా చేస్తుంది ఆ పార్టీ అధిష్టాణం. అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే ఈపాటికే… “ఘనంగా కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం”, “కర్ణాటక అసెంబ్లీలో కొలువైన కొత్త కేబినెట్” అనే వార్తలు వచ్చేవి. కానీ… ఇప్పటికీ “కర్ణాటకలో కొత్త సీఎం ఎవరు” అనే ప్రశ్నార్థకపు కథనాలే వస్తున్నాయి. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టాణానికి ఒక సూచన చేస్తున్నారు కర్ణాటక దళిత నేతలు! ఈ విషయాన్ని గనుక అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే… సీఎం ఎవరనే సమస్య ఒక్క నిమిషంలో పరిష్కారం అయిపోతుందని అంటున్నారు.

కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం జాప్యం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో… కొత్త పేర్లు, కొత్త సమీకరణలు తెరమీదకొస్తున్నాయి. అధిష్ఠానం పెద్దలు గత నాలుగు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తో ఎడతెగని మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య పేరు కన్ ఫాం అని… డీకే కే ఈసారి ఛాన్స్ అని రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో… తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అది అలాంటి ఇలాంటి ట్విస్ట్ కాదు. ఎవరైతే నిర్ణయం ప్రకటించాల్సి ఉందో ఆయన పేరే ఈసారి తెరపైకి వచ్చింది.

అవును… సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల కంటే మల్లికార్జున్ ఖర్గే నే కర్ణాటక ముఖ్యమంత్రి కావాలంటూ ఆ రాష్ట్ర ఎస్సీ కార్యకర్తలు కర్ణాటక పీసీసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్లెక్సీలు, బ్యానర్లూ ప్రదర్శించారు. రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా ఉన్నందున ఖర్గేను ముఖ్యమంత్రి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఇలా చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని… ఆ నిర్ణయానికి సిద్ధరామయ్య, డీకే కూడా మనస్పూర్తిగా మద్దతిస్తారని చెబుతున్నారు. పైగా… ఖర్గేను సీఎంను చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని డీకే శివకుమార్ ఇప్పటికే చెప్పారని, సిద్ధరామయ్య కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పరనేది వారి వాదనగా ఉంది.

మరి అనూహ్యంగా తెరపైకి వచ్చినె ఈ డిమాండ్ ముదిరి పాకాన పడకముందే కాంగ్రెస్ అధిష్టాణం జాగ్రత్తలు తీసికోవాలని సూచిస్తున్నారు విశ్లేషకులు. దీంతో… ఇన్ని సమీకరణలు, ఇన్నేసి మీటింగుల అనంతరం కర్ణాటకకు ఎవరు సీఎం అవుతారనేదానిపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టాణం ఈ విషయంపై ఒక క్లారిటీకి వస్తోందా… లేక, ఇలా సాగదీసుకుంటూ ప్రజల్లో చులకన అవుతుందా అన్నది వేచి చూడాలి!