తెలంగాణలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల హడావుడి లేకుండా కొన్ని రోజులు తెలంగాణ ప్రశాంతంగా ఉంది. కానీ.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల హడావుడి మొదలైంది. దుబ్బాక నియోజకవర్గంలో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికల జరగనుంది. ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా చాలెంజ్ గా తీసుకున్నాయి. అయితే ఈ ఎన్నికలు కేసీఆర్ ఓటమికి బాటలుగా నిలవబోతున్నాయా? కేసీఆర్ ను ఓడించడం కోసమే.. కాంగ్రెస్, బీజేపీ పన్నాగాలు పన్నుతోందా? అందుకే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ను దుబ్బాక బరిలోకి దించుతోందా? కేసీఆర్ ఓటమికి ఈ ఎన్నికలే తొలి అడుగు అయితే.. రానున్న ఎన్నికల్లో ఈ ఎన్నికల ప్రభావం టీఆర్ఎస్ పై పడే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
అధికార పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తపన పడుతోంది. మరోవైపు ఈ ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నేతలు ఆరాటపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ పార్టీకి ప్రజల్లో నమ్మకం కలిగినట్టేనని.. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, బీజేపీలు ఊహించుకుంటున్నాయి. అందుకే.. ఈ ఉప ఎన్నిక ప్రతి పార్టీకి ఓ చాలెంజింగ్ గా మారింది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడే లేడు. ఏదో ఇద్దరు ముగ్గురు తప్పితే. బీజేపీ కూడా అంతే. తెలంగాణలో బీజేపీ పార్టీ రోజురోజుకూ పతనం కావడానికి ముఖ్య కారణం.. ఆ పార్టీలో సరైన నాయకులు లేకపోవడం వల్లే.
ఇక.. కాంగ్రెస్ విషయానికి వస్తే… దుబ్బాక ఉపఎన్నికలో విజయశాంతిని పోటీ చేయించాలని హైకమాండ్ భావిస్తోందట. ఆమె గత ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా పనిచేశారు. రాజకీయాల్లో ఆమెను ఒక ఫైర్ బ్రాండ్ గా చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ ఆమెకు సరైన ప్లాట్ ఫాం దొరకలేదు. ఆ ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్ అయిన రాములమ్మ మళ్లీ 2019 ఎన్నికల నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటోంది.
దుబ్బాకలో అధికార పార్టీని ఢీకొట్టాలంటే.. సీఎం కేసీఆర్ ను ఓడించాలంటే విజయశాంతి అయితేనే కరెక్ట్ అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. దీంతో కాంగ్రెస్ నుంచి ఆమెను బరిలోకి దించుతున్నారట. విజయశాంతికి మెదక్ జిల్లాతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. 2009 ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో తన రాజీనామాను సమర్పించారు. అది వేరే విషయం. కానీ.. ఆమెకు మెదక్ తో అనుబంధం అయితే ఉంది.
అందుకే… టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే దుబ్బాక బరిలో విజయశాంతి ఉండాల్సిందే అని కాంగ్రెస్ ఫిక్స్ అయిందట. మరోవైపు టీఆర్ఎస్ ను ఢీకొనడానికి కాంగ్రెస్ లో అంత సమర్థులైన నాయకులు కూడా వేరే లేరు. అందుకే.. ఈసారి రాములయ్మకు చాన్స్ ఇచ్చి చూద్దామని హైకమాండ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
ఇక.. బీజేపీ విషయానికి వస్తే.. మెదక్ ఉమ్మడి జిల్లాలో ఒక్క రఘునందన్ రావు తప్పితే మరో నేత లేడు. బీజేపీకి పెద్దగా మెదక్ జిల్లాలో ఓటు శాతం కూడా లేదు. కాబట్టి.. దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలిచే అవకాశం అయితే లేదు.
అంటే.. ఇక పోటీ అనేది కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే. అందులోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన అభ్యర్థిని బరిలో దింపుకున్నా… ఓటు బ్యాంకింగ్ లో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ సరైన క్యాండిడేట్ ను దింపితే.. ఖచ్చితంగా అధికార టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవచ్చు.. అన ఉద్దేశంతో ఏది ఏమైనా సరే.. విజయశాంతిని ఈసారి బరిలో దింపాల్సిందే అని ఫిక్స్ అయిందట కాంగ్రెస్ హైకమాండ్.