ఇంట్లో అద్దం ఈ షేపులో ఉంటే.. డబ్బు, ప్రశాంతత రెండూ మాయం.. !

ఇల్లు ఎప్పుడూ సంతోషం, ఐశ్వర్యం, ప్రశాంతతతో నిండిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ శుభశక్తులు ఇంట్లో నిలవాలంటే వాస్తు శాస్త్రం చెబుతున్న చిన్న చిన్న నియమాలు పాటించడం చాలా అవసరం. అందులో అద్దం (Mirror) ప్లేస్‌మెంట్‌కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో ప్రత్యేకం. ఇంట్లో అద్దాన్ని సరైన చోటు పెట్టడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ రెట్టింపు అవుతుందని, కానీ తప్పు దిశలో పెడితే దురదృష్టం, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గొడవలు పెరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం కేవలం మన ప్రతిబింబం చూపించే వస్తువు మాత్రమే కాదు. అది ఇంట్లోని ఎనర్జీ ఫ్లోను దారితీసే ఒక మాధ్యమం. అందుకే దాన్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రధాన ద్వారం (మెయిన్ డోర్) ద్వారా ప్రవేశిస్తుంది. ఆ డోర్‌కి ఎదురుగా అద్దం పెడితే, ఆ మంచి ఎనర్జీ వెంటనే తిరిగి బయటకు వెళ్ళిపోతుంది. దీని వలన సంపద, అవకాశాలు ఇంట్లో నిలవవు. కాబట్టి అద్దాన్ని డోర్ పక్క గోడకు పెట్టడం మంచిది. ఇది ఎనర్జీని లోపలికి ఆహ్వానించినట్టే అవుతుంది.

వాస్తు ప్రకారం ఉత్తరం, తూర్పు గోడలపై అద్దం పెడితే అది అత్యంత శుభప్రదం. ఉత్తరం కుబేరుడి దిక్కు, కాబట్టి ఆ దిశలో అద్దం పెట్టడం సంపద ప్రవాహాన్ని పెంచుతుంది. తూర్పు సూర్యోదయ దిశ, ఆ దిశలో అద్దం పెడితే సూర్యకాంతి ప్రతిబింబం ఇంట్లో వ్యాపించి ఆరోగ్యం, ఉత్సాహం ఇస్తుంది. కానీ దక్షిణం లేదా పడమర గోడలపై అద్దం పెట్టడం మాత్రం ఘోర వాస్తు దోషం. ఇది ఇంట్లో అశాంతి, టెన్షన్, గొడవలకు దారితీస్తుంది.

అద్దం ఎల్లప్పుడూ పాజిటివ్ ప్రతిబింబాలనే చూపాలి. పచ్చని మొక్కలు, సూర్యకాంతి, అందమైన చిత్రాలు అద్దంలో కనిపించేలా సెట్ చేస్తే అది ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. కానీ అద్దంలో చిందరవందరగా ఉన్న వస్తువులు, చెత్త, పదునైన వస్తువులు కనిపిస్తే నెగిటివ్ ఎనర్జీ రెట్టింపు అవుతుంది. డైనింగ్ రూమ్‌లో అద్దాన్ని డైనింగ్ టేబుల్ రిఫ్లెక్ట్ అయ్యేలా పెట్టడం వాస్తు ప్రకారం చాలా మంచిది. ఇది ఆహారం, సంపద, ఐశ్వర్యం రెట్టింపు అవుతాయని నమ్మకం ఉంది. అయితే అద్దం ఎల్లప్పుడూ శుభ్రంగా, పగలకుండా ఉంచడం తప్పనిసరి. మురికిగా ఉన్న అద్దం నెగిటివిటీని ఆకర్షిస్తుంది.

బాత్రూమ్‌లో అద్దాన్ని ఉత్తరం లేదా తూర్పు గోడపై పెట్టాలి. టాయిలెట్ సీట్‌కి ఎదురుగా అద్దం ఉండకూడదు. అదే హోమ్ ఆఫీస్‌లో ఉత్తరం లేదా తూర్పు గోడలపై అద్దం పెడితే కెరీర్‌లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కానీ వర్క్ డెస్క్‌కి ఎదురుగా అద్దం ఉండకూడదు, ఇది ఫోకస్‌ను దెబ్బతీస్తుంది. క్యాష్ లాకర్ దగ్గర అద్దం పెడితే సంపద రెట్టింపు అవుతుందని వాస్తు చెబుతోంది.

అద్దం ఆకారంలో కూడా శాస్త్రం ఉంది. స్క్వేర్ లేదా రెక్టాంగిల్ అద్దాలు స్థిరత్వం, సమతౌల్యం ఇస్తాయి. కానీ రౌండ్, ఓవల్, అన్‌ఈవెన్ షేప్స్ గందరగోళ ఎనర్జీని సృష్టిస్తాయి. పగిలిన లేదా మచ్చలున్న అద్దాలను వెంటనే మార్చేయాలి, ఎందుకంటే అవి నెగిటివ్ శక్తులను ఆహ్వానిస్తాయి.వాస్తు నిపుణుల మాటల్లో “అద్దం ఇంటి ఆత్మలాంటి పాత్ర పోషిస్తుంది. దాన్ని సరైన దిశలో పెట్టితే జీవితం ప్రకాశిస్తుంది. కానీ తప్పుగా పెడితే చీకట్లు పాకుతాయి. కాబట్టి మీ ఇంట్లో అద్దం ఎక్కడ ఉందో ఈ పండుగ సీజన్‌లో ఒక్కసారి పరిశీలించండి. సరైన చోటు పెట్టిన ఆ అద్దం మీ అదృష్టాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది..!