జగన్ ప్రభుత్వం ఫాల్ డౌన్ ‘ వెనకాల ఇంత ప్లానింగ్ ఉందా?

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి హై కోర్ట్ లో ఎదురుదెబ్బ తగులుతుంది. డాక్టర్ సుధాకర్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం అనే విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హై కోర్ట్ తప్పు పట్టింది. అయితే తమకు అడ్డు పడుతున్న హై కోర్ట్ పై వైసీపీ ప్రభుత్వం కోపం పెంచుకుందని, హై న్యాయమూర్తులపై పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉందని కొన్ని పత్రికల్లో, చానెల్స్ లో కథనాలు ప్రచారం అయ్యాయి.

Why YS Jagan's government went to Supreme court

ఈ వ్యాఖ్యలను బలపరచడానికి ఈశ్వరయ్య ఆడియో టేప్స్ సహకరిస్తున్నాయనడంలో ఎలాంటి సందేశం లేదు. వైసీపీ ప్రభుత్వం హై కోర్టు న్యాయవాదుల యొక్క ఫోన్స్ ను ట్యాప్ చేస్తున్నారనే విషయాలు కూడా బయటకు వచ్చాయి.ఈ కథనంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణారాజు స్పందించారు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ అనే వార్తల్లో నిజముంటే జగన్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు. తన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై వెంటనే ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వానికీ న్యాయవ్యవస్థకు మధ్య సంబంధాలను దెబ్బతీసి దూరం పెంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. కొంత మంది వ్యక్తులు, కొన్ని శక్తులు కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అనుమానిస్తోంది.

ఈ అనుమానాలను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది. ఈశ్వరయ్య సంఘటనను ఆధారంగా చేసుకొని వైసీపీ ప్రభుత్వానికి, చట్టానికి మధ్య అఘాతం సృష్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని జగన్ ప్రభుత్వం తిప్పి కొట్టకపోతే రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి ఫాలో డౌన్ స్టార్ట్ కానుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.