Tesla Showroom: టెస్లా మొదటి షోరూం ముంబైలో.. నెక్స్ట్ ఎక్కడ?

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి మరో కీలక అడుగు వేసింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో తన తొలి షోరూం కోసం లీజు ఒప్పందాన్ని ఫైనల్ చేసింది. ఈ ప్రదేశం కోసం టెస్లా మొత్తం నెలకు రూ.35 లక్షలు అద్దె చెల్లించనున్నట్లు అంచనా. లీజు వ్యవధి మొత్తం ఐదేళ్లు కాగా, మరో షోరూం ఢిల్లీలోని ఏరోసిటీ వద్ద ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ ఒప్పందం టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కొన్ని వారాల తర్వాత ఖరారైన విషయం విశేషం. అలాగే, ఫిబ్రవరిలో భారత మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీ 13 ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేయడం, టెస్లా భారత ప్రవేశ ప్రణాళికలు తిరిగి వేగం పెంచుతున్నట్లు సంకేతాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా – అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మరింత స్పష్టత వచ్చే సమయానికి, టెస్లా భారత మార్కెట్లో తన ఉనికిని పెంచేందుకు సిద్ధమవుతుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే, భారత్‌లో దిగుమతి అయిన కార్లపై ప్రస్తుతం 110% డ్యూటీ ఉండటం టెస్లాకు పెద్ద అడ్డంకిగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశంలోని అధిక శుల్కాల కారణంగా టెస్లా స్థానికంగా ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇది అమెరికాకు అన్యాయం అవుతుందని, ఇతర దేశాలు కూడా అమెరికాను టారిఫ్‌లతో శాషిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక టెస్లా అధినేత మస్క్ కూడా భారత మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో, ఆయన సూచనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపుదిద్దే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా, టెస్లా భారత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు సిద్ధమవుతుండటంతో, కంపెనీ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.

రెడ్ బుక్ లు రెండా.? || Red Book Politics In AP || Lokesh & Pawan Kalyan || YsJagan || Telugu Rajyam