అమెరికా వెళ్ళారు.! అక్కడ కులాల కుంపట్లేంటి.? ప్చ్.. చాలాకాలంగా నడుస్తోన్న తతంగం ఇది. పార్టీల వారీగా విడిపోయారు.. కులాల వారీగా కూడా విడిపోయారు. అందరూ మన తెలుగోళ్ళేనండోయ్.! కానీ, అందులో అందరూ అలా కాదు. కొందరు మాత్రమే.!
కొందరి వల్ల సహజంగానే అందరికీ చెడ్డ పేరు వస్తోంది. మరీ ముఖ్యంగా ‘తానా’ అంటే చాలు, ప్రతిసారీ వివాదమే.! ఈసారి తానా సభలకీ పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ సంగతి పక్కన పెడితే, నిర్వాహకులు.. సరిగ్గా భోజనాలు కూడా పెట్టలేకపోయారు. టిక్కెట్లు కొనుక్కుని వచ్చినోళ్ళు.. నిర్వాహకుల్ని నిలదీయక తప్పలేదు.
ఇంకోపక్క, తెలుగు తమ్ముళ్ళు.. అదేనండీ, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు.. గ్రూపుల వారీగా విడిపోయి కొట్టుకున్నారు. జూనియర్ ఎన్టీయార్, నారా లోకేష్ అభిమానులుగా విడిపోయి, తెలుగు తమ్ముళ్ళు కొట్టుకున్న వైనం.. వీడియోల రూపంలో బయటపడింది.
అబ్బే, ఇదంతా వైసీపీ కుట్ర.. అంటోంది నిస్సిగ్గుగా టీడీపీ. వైసీపీ మద్దతుదారులే, జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగులో వచ్చి గలాటా చేశారన్నది టీడీపీ సానుభూతిపరుల ఆరోపణ.
అయినా, అమెరికా గడ్డ మీద, తెలుగు రాజకీయాల గోలేంటి.? ఎన్నారైలు.. ఇండియాకి వచ్చి ఓట్లు వేయరు. కానీ, ఇక్కడి రాజకీయాలపై ఆసక్తి వుంటుంది. మంచిదే.. మాతృభూమిపై మమకారాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ గొడవలవల్ల తెలుగు నేల పరువు పోతోంది కదా, అమెరికాలో.! ప్రతిసారీ జరిగే తంతే ఇది.! ప్చ్.. ఈ నిస్సిగ్గుతనానికి ముగింపు ఎలా.?