సంచలనంగా మరో సర్వే… తెలంగాణలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి?

తెలంగాణ ఎన్నికలకు వారం రోజులే సమయం ఉన్న ఈ దశలో మరో సర్వే హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే న్యూస్ టాప్ తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక వైరల్ గా మారిన నేపథ్యంలో తాజాగా రాజ్ నీతి గ్రూప్ సర్వే తెరపైకి వచ్చింది. దీంతో వరుస సర్వే ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అయితే… వరుసగా విడుదలైన ఈ రెండు సర్వేలూ అధికార బీఆరెస్స్ కు గుడ్ న్యూస్ చెప్పడం గమనార్హం.

తాజాగా రాజ్ నీతి గ్రూప్ చేపట్టిన ఈ సర్వే బీఆరెస్స్ హ్యాట్రిక్ విజయం ఖాయమని తేల్చింది. ఇందులో భాగంగా బీఅరెస్స్ 75 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజ్ నీతి గ్రూప్ సర్వే తన ఫలితాలు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం

బీఆరెస్స్ – 75 (6 సీట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు)

కాంగ్రెస్ – 31 (4 సీట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు)

బీజేపీ – 5 (2 సీట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు)

ఎంఐఎం – 7

ఇతరులు – 1 ఫలితాలు వస్తాయని తెలిపింది!

ఇక మొత్తం 119 నియోజకవర్గాల్లో 38,351 శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈ సర్వే చేపట్టినట్లు రాజ నీతి సంస్థ తెలిపింది. ఇందులో ప్రధానంగా రైతులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులతోపాటు గృహిణిలు కూడా ఉన్నారని తెలిపారు. ఇలా అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలు సేకరించి సర్వే ఫలితాలు విడుదల చేసినట్లు వెల్లడించారు.