2024 ఏడాది చివరిలో మెల్‌బోర్న్ టెస్ట్‌లో పరాజయం ఎదుర్కొన్న టీమిండియా, 2025ను సరికొత్తగా ఆరంభించేందుకు సిద్ధమవుతోంది. భారత క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని జనవరి 3న సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం భారత్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతుంది. 2025 క్రికెట్ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండనుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీతో భారత క్రికెట్ అభిమానులు క్రికెట్ పండుగను ఆస్వాదించనున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కీలకంగా నిలుస్తోంది. యూఏఈ, పాకిస్థాన్ వేదికలుగా జరిగే ఈ టోర్నమెంట్‌లో భారత్ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఈ టోర్నమెంట్ తర్వాత జూన్-ఆగస్టు మధ్య టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇక ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్‌లతో పాటు రెండు కీలక ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగనున్నాయి.
2025లో టీమిండియా పూర్తి షెడ్యూల్:
జనవరి – ఫిబ్రవరి (స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్)
1. టీ20లు:
జనవరి 22: తొలి టీ20 (చెన్నై)
జనవరి 25: రెండవ టీ20 (కోల్‌కతా)
జనవరి 28: మూడవ టీ20 (రాజ్‌కోట్)
జనవరి 31: నాలుగవ టీ20 (పుణె)
ఫిబ్రవరి 2: ఐదవ టీ20 (ముంబై)
2. వన్డేలు:
ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9: రెండవ వన్డే (కటక్)
ఫిబ్రవరి 12: మూడవ వన్డే (అహ్మదాబాద్)
ఫిబ్రవరి – మార్చి (ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ)
1. ఫిబ్రవరి 20: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)
2. ఫిబ్రవరి 23: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (దుబాయ్)
3. మార్చి 1: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)
జూన్ – ఆగస్టు (ఇంగ్లండ్ పర్యటన)
1. జూన్ 20-24: తొలి టెస్ట్ (లీడ్స్)
2. జూలై 2-6: రెండవ టెస్ట్ (బర్మింగ్‌హామ్)
3. జూలై 10-14: మూడవ టెస్ట్ (లండన్)
4. జూలై 23-27: నాలుగవ టెస్ట్ (మాంచెస్టర్)
5. జూలై 31 – ఆగస్టు 4: ఐదవ టెస్ట్ (లండన్)
ఆగస్టు (బంగ్లాదేశ్ పర్యటన)
1. 3 వన్డేలు
2. 3 టీ20లు
అక్టోబర్ (స్వదేశంలో ఆసియా కప్)
1. టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్
అక్టోబర్ – నవంబర్ (ఆస్ట్రేలియా పర్యటన)
1. 3 వన్డేలు
2. 5 టీ20లు