కొంతమంది రాజకీయ నాయకుల వ్యవహారం “నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు?” అన్నట్లుగా ఉంటే… మరికొంతమంది ప్రవర్తన.. “అసలు తమను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు”? అనే విషయంపై ఏమాత్రం క్లారిటీ లేకుండా ఉంటారనే కామెంట్లు నిత్యం వినిపిస్తుంటాయి. ఈ సమయంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు.. పేకాట క్లబ్బులు తెరిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అవును… అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… అనంతపురంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రతీ జిల్లాలోనూ పేకాట క్లబ్బులు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. పేకాట క్లబ్బులు తెరిపించమని తనవద్దకు చాలా మంది వస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… ఇప్పటికే తాను ఈ విషయంపై కలెక్టర్ తో మాట్లాడినట్లు తెలిపారు. కచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, కచ్చితంగా పేకాట క్లబ్బులు తెరిపిస్తానని హామీ ఇచ్చారు! దీంతో.. అక్కడునన్వారంతా చప్పట్లు కొడుతూ తమ సంతోషాన్ని, అభినందనలను వ్యక్తం చేశారు.
అక్కడితో ఆగని ఆయన… అసలు పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ టీడీపీ ఎమ్మెల్యే చేసిన “పేకాట క్లబ్బులు తెరిచేందుకు కృషి” వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నెటిజన్లు సదరు ఎమ్మెల్యేపై కామెంట్ సెక్షన్ లో సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.
ఇందులో భాగంగా… ఆ వీడియోని షేర్ చేస్తూ “టీడీపీ వారివి మంచి మంచి కట్టుబాట్లు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో… “వాట్ ఏ విజన్ చంద్రబాబు.. వాట్ ఏ థాట్ నారా లోకేష్”? అంటూ స్పందిస్తున్నారు. “ఆ విధంగా ముందుకుపోదాం” అని ఒకరంటే… “ఇది నిజమైన ఆడుదాం ఆంధ్రా” అంటూ మరొకరు సెటైర్లు పేలుస్తున్నారు.
“నాణ్యమైన మద్యం అందుబాటు ధరల్లో అని చంద్రబాబు ప్రకటించడాన్ని ఆదర్శంగా తీసుకుని.. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఎమ్మెల్యే ఇలా ఆలోచించి ఉంటారు!” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో… “సంపద సృష్టించడానికి కాదేదీ అనర్హం” అని ఇంకొకరు తగులుకుంటున్నారు. మరొకరు “సేవ్ ఏపీ ఫ్రం టీడీపీ” హ్యష్ ట్యాగ్ షేర్ చేస్తున్నారు.
మంచి మంచి కట్టుబాట్లు…
చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్లు తెరిపిస్తా
– టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్#AndhraPradesh #SaveAPFromTDP pic.twitter.com/8iy7dDxFyN
— Jagananna Connects (@JaganannaCNCTS) July 30, 2024