టీడీపీ అను‘కుల’ మీడియా చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేసింది.?

చిరంజీవికి క్యాన్సర్.. అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా చేసిన దుష్ప్రచారం అందరికీ తెలిసిందే. చిరంజీవి మాట్లాడిన మాటలు వేరు, దాన్ని టీడీపీ అను‘కుల’ మీడియా మార్చి ప్రచారం చేసిన తీరు వేరు.

కేవలం బ్రేకింగ్ న్యూస్ కోసమే టీడీపీ అను‘కుల’ మీడియా కక్కుర్తి పడిందా.? అంటే, ఈ విషయమై మీడియా వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అత్యంత వ్యూహాత్మకంగా టీడీపీ అను‘కుల’ మీడియా ఈ పన్నాగం పన్నిందట.

టీడీపీ – జనసేన మధ్య పొత్తుకి సంబంధించి సానుకూల వాతావరణం ఏర్పడిన ప్రతిసారీ, టీడీపీ అను‘కుల’ మీడియా ఈ తరహా దుష్ప్రచారాన్ని చిరంజీవి కేంద్రంగా ఏదో ఒక రూపంలో తెరపైకి తెస్తోంది.

2009 ఎన్నికల్లో టీడీపీకి చిరంజీవి వల్ల దారుణమైన దెబ్బ తగలిందన్నది టీడీపీ అను‘కుల’ మీడియా ఆవేదన. అప్పటినుంచి ఇప్పటిదాకా, టీడీపీ సంగతెలా వున్నా టీడీపీ అను‘కుల’ మీడియా మాత్రం, చిరంజీవిపై ద్వేషాన్ని తగ్గించుకోలేకపోతోంది.

ఇదిలా వుంటే, చిరంజీవికి క్యాన్సర్ అన్న ప్రచారంతో ఒక్కసారిగా చిరంజీవి అభిమానులు తీవ్రంగా కలత చెందారు. పవన్ కళ్యాణ్ మీద ఎటాక్ చేశారు సోషల్ మీడియా వేదికగా. ‘ఇలాంటి వెధవలు పెంచి పోషిస్తున్న టీడీపీకి మద్దతివ్వొద్దు’ అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు.

వారిపై పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో టీడీపీ కార్యకర్తలే ఎదురుదాడికి దిగుతున్నారు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేందుకే టీడీపీ అండతో టీడీపీ అను‘కుల’ మీడియా ఈ చిచ్చు రాజేసిందా.?