Sunita Williams: అంతరిక్షంలో మరింత కఠినంగా సునీతా విలియమ్స్ పరిస్థితి.. భూమిపైకి వచ్చేదెప్పుడు?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 2023 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన ఆమె, కొద్ది రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా అనుకోని సాంకేతిక సమస్యల కారణంగా నెలల తరబడి అక్కడే ఉండాల్సి వచ్చింది. సాధారణంగా వ్యోమగాములు కొన్ని వారాలపాటు మాత్రమే శూన్యగురుత్వంలో ఉంటేనే భూమికి తిరిగి వచ్చాక వారికెన్నో అనుభవ రుగ్మతలు ఎదురవుతాయి.

అయితే సునీతా ఇప్పటికి ఏకంగా ఏడు నెలలు పూర్తయ్యే దశకు వచ్చిందంటే ఆమె పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సునీతా విలియమ్స్ తాను ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించడంతో అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టమో అందరికీ అర్థమైంది. శూన్య గురుత్వాకర్షణ కారణంగా నడవడం, కూర్చోవడం, పడుకోవడం అన్నీ అసాధ్యమైపోయాయని, భూమిపై తిరిగి అడుగుపెట్టినప్పుడు తన శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేనని ఆమె వెల్లడించారు.

గతంలోనే పలు మార్లు నాసా క్రూ వారిని భూమికి తీసుకురావాల్సి ఉండగా.. అనేక సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటి వరకు ఆమె ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ విషయాన్ని స్వయంగా సమీక్షించారని తెలుస్తోంది. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ట్రంప్ నాసా, స్పేస్ ఎక్స్‌లను త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించారని, వీలైనంత త్వరగా సునీతా విలియమ్స్ సహా మరొక వ్యోమగామిని భూమికి తీసుకురావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

స్పేస్ ఎక్స్ ప్రస్తుతం క్రూ-10 మిషన్ కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్ ద్వారా ఫ్రీడమ్ క్యాప్సూల్ ఉపయోగించి వ్యోమగాములను భూమికి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే టెక్నీషియన్లు అన్ని ముఖ్యమైన పరీక్షలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ మిషన్ మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతుందని భావిస్తున్నారు. ఇక భూమికి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్ తన శరీర పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.

కమ్మ సేఫ్ - కాపులు అవుట్ || Director Geetha Krishna About Pawan kalyan Politics || Chandrababu || TR