భారతీయ వంటకాలలో టమాటాకి విడదీయని అనుబంధం ఉంది.. దాదాపు ప్రతి కూరలోనూ, ప్రతి పచ్చడిలోనూ దాని ముద్ర ఉంటుంది. కేవలం రుచికే కాకుండా ఆకర్షణీయమైన ఎర్రరంగు కోసం కూడా టమాటా తప్పనిసరి వాడుతుంటారు. కానీ ఎంత రుచిగా ఉన్నా, ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హానికరం అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమాటాలో విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్, ఫైబర్ వంటి పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. ఇవి రక్తహీనత, అధిక రక్తపోటు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే రోజువారీ అవసరానికి మించి టమాటాలు తింటే అనుకోని ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల మొదటగా అసిడిటీ సమస్యలు వస్తాయి. టమాటాలో విటమిన్ సి అధికంగా ఉండటంతో కడుపులో ఆమ్లం పెరిగి జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. అలాగే గ్యాస్ సమస్య పెరగడంతో bloating, కడుపులో నొప్పులు కలుగుతాయంట. అదే విధంగా, కిడ్నీ రాళ్లు ఉన్నవారు టమాటా తప్పక మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టమాటా గింజల్లో ఉండే పదార్థాలు రాళ్ల సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. గింజలు తీసేసి తినడం కొంతవరకు సేఫ్ అని అంటున్నారు.
ఇదీ చదవండి: నవరాత్రుల్లో ఈ తప్పలు అస్సలు చేయకండి.. అమ్మవారికి ఆగ్రహం వస్తుంది..?
మరో ప్రధాన సమస్య గుండెల్లో మంట. ఎక్కువ టమాటాలు తినడం వల్ల ఎసిడిటీ పెరిగి ఛాతిలో మంటలు రావడం సాధారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, గొంతులో మంట, నోటి అలర్జీలు, తలతిరుగుడు కూడా రావచ్చు. టమాటాలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉండటం వల్ల కొందరికి హిస్టామిన్ రియాక్షన్లు కూడా వస్తాయి. ముఖ్యంగా చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు రావడం, శ్వాస ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా టమాటాలో ఉండే సోలనిన్ అనే ఆల్కలాయిడ్ కారణంగా కీళ్ల నొప్పులు, వాపులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ప్రతి రోజూ వంటలో టమాటా తప్పనిసరి అయినా, పరిమితంగా వాడితేనే ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్కోరోజు 1–2 టమాటాలు సరిపోతాయని, అంతకంటే ఎక్కువ తీసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశముందని చెబుతున్నారు. అంటే, టమాటా వంటకు రుచి ఇస్తుంది కానీ అతిగా తింటే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే టమాటాను పరిమిత పరిమాణంలో తీసుకోవడం అలవాటు చేసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
