షర్మిల, విజయమ్మ.. ‘పోలీస్’ చెంప పగలగొట్టారు.!

ఎందుకిలా జరిగిందబ్బా.? ముందేమో వైఎస్ షర్మిల, ఆ తర్వాత వైఎస్ విజయమ్మ.. ఇద్దరూ కూడబలుక్కున్నట్టున్నారు. రాజకీయాల్లో నిరసనలు తెలపడం మామూలే. అదే సమయంలో రాజకీయ నాయకులు సంయమనం పాటించాలి.. పోలీసుల విషయంలో.

పోలీసులూ బాధ్యతగా వ్యవహరించాల్సి వుంటుంది. రాజకీయ నాయకుల్ని నిలువరించే క్రమంలో పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్యకర్తల్ని కంట్రోల్ చేయాలి, నాయకుల్ని కంట్రోల్ చేయాలి. ఏం చేసినా, శాంతి భద్రతల్ని పరిరక్షించడమే పోలీసుల బాధ్యత.

అయితే, అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తోందన్న విమర్శలు ఈనాటివి కావు. అయినాగానీ, పోలీసులపై చెయ్యిచేసుకునే విషయంలో రాజకీయ నాయకులే నిగ్రహం పాటించాలి. దురదృష్టం వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ.. ఇద్దరూ సంయమనం కోల్పోయారు.

తొలుత వైఎస్ షర్మిల, పోలీస్ అధికారులపై చెయ్యి చేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ విజయమ్మ వంతు. ఈ ఇద్దరి తీరుతో ఒక్కసారిగా తెలుగునాట కలకలం బయల్దేరింది. తెలంగాణలో జరిగాయి ఈ ఘటనలు. పోలీసులు ఇప్పటికే వైఎస్ షర్మిలపై కేసులు నమోదు చేశారు. వైఎస్ విజయమ్మ మీద కూడా కేసులు నమోదు చేయనున్నారు.

అధికారంలోకి వస్తాం.. అని చెబుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇది నిజంగానే చెంప దెబ్బ. పోలీసుల్ని గౌరవించని రాజకీయ నాయకులు.. ప్రజలకు ఏం సందేశమిస్తారు.? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా వుంటుందా.?