ఏపీలో కరోనా కొత్త వేవ్‌.. బాధ్యత ఎవరిది.?

risk of coronavirus spreading in andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చిందిగానీ, మళ్ళీ విజృంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు కొన్నాళ్ళ క్రితం నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్‌లో. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారి కారణంగా, విదేశాల నుంచి వచ్చిన కారణంగా.. కేసుల నమోదు చాలా ఎక్కువగా కనిపించింది. అయితే, అంతటి విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్‌ కాస్త క్షేమంగానే కోలుకున్న మాట వాస్తవం. మరి, పెద్ద విపత్తుని చూసిన ఆంధ్రప్రదేశ్‌, కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు విషయంలో ఎంత జాగ్రత్తగా వుండాలి.?

risk of coronavirus spreading in andhra pradesh
risk of coronavirus spreading in andhra pradesh

కొంప ముంచుతున్న అన్‌లాక్‌
పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా, ఇంకా బయటపడాల్సిన కేసులు చాలానే వున్నాయి. కరోనా పట్ల సరైన అవగాహన లేకపోవడంతో, మాస్క్‌లు ధరించకుండా జనం బయటకు వచ్చేస్తున్నారు.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించడంలేదు. ఎలాగైతేనేం, పరిస్థితి అదుపులోకి వస్తోందన్న తరుణంలోనే అన్‌లాక్‌ సడలింపులు ఎక్కువైపోయి.. కరోనా వేగంగా విస్తరించడానికి మార్గం సుగమం అయ్యింది.

సెకెండ్‌ వేవ్‌ భయాలు పెరుగుతున్నాయ్‌..
‘సెకెండ్‌ వేవ్‌ వస్తే, దాన్ని మానవ తప్పిదంగానే భావించాలి..’ అంటూ సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది కూడా నిజమే. నిజానికి, మొదటి వేవ్‌ని కూడా మానవ తప్పిదంగానే భావించాల్సి వుంటుంది. రెండో వేవ్‌ క్షమించరాని నేరమే. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలు తెరచుకుంటున్నాయి.. స్కూళ్ళు తెరవడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోందన్న విమర్శ వుంది. అయితే, స్కూళ్ళు తెరవడం అనేది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతోంది. దాదాపు 800 మంది టీచర్లు 500 మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడినట్లు నవంబర్‌ 2 నుంచి జరుపుతున్న టెస్టుల్లో తేలింది.

ఈ పాపం ఎవరిది.?
విద్యార్థుల్ని ఎన్నిరోజులని విద్యాభ్యాసానికి దూరంగా వుంచగలం.? పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.. ఇతరత్రా రాజకీయ కార్యక్రమాలూ జరుగుతున్నాయి.. షికార్లు ఎక్కువయ్యాయి.. సో, స్కూళ్ళను తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, విద్యార్థుల ద్వారా కరోనా టీచర్లకు, టీచర్ల ద్వారా విద్యార్థులకు సోకితే.. ఆ తర్వాత సమాజంలోకి మరింత వేగంగా కరోనా వెళ్ళిపోతుందన్న విషయాన్ని ప్రభుత్వం లైట్‌ తీసుకుందా.? అన్న సందేహాలు కలగకమానవు. పాజిటివిటీ రేట్‌ తక్కువే.. అని ప్రభుత్వం చెప్పడాన్ని సమర్థించలేం. సెకెండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగా వుంటే.. తద్వారా జరిగే నష్టానికి ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాల్సి వుంటుంది.