రష్మికను ‘డ్రైవ్’ చేస్తున్న బాలీవుడ్ హీరో.!

కన్నడ కస్తూరి రష్మికా మండన్నాకి క్రేజ్‌తో పాటూ, కాంట్రవర్సీలూ ఎక్కువే. అయితే, ఈ మధ్య ఏ కాంట్రవర్సీలో ఇరుక్కున్నా రష్మికను ఓ బాలీవుడ్ హీరో సమర్ధిస్తూ వస్తున్నాడట.

ఆమెకు మోరల్ సపోర్ట్‌గా నిలుస్తున్నాడట. సౌత్ వరకూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మికకు ఎప్పుడూ సపోర్ట్‌గా వుంటాడు. వీరిద్దరికీ మధ్య మంచి స్నేహ బంధం వుంది. స్నేహం కన్నా అంతకు మించిన అనుబంధమేదో కూడా వుందంటూ ప్రచారం జరుగుతోందనుకోండి.

అలాగే, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ఓ యంగ్ హీరోతో రష్మికకు అలాంటి స్నేహ బంధమే వుందట. ఈ స్నేహం విషయంలోనూ పలువురు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతలా మోరల్ సపోర్ట్ ఇస్తున్న ఆ యంగ్ హీరోకీ, రష్మీకకు మధ్య కుచ్ కుచ్ హోతా హై లాంటిదేదో జరుగుతోందంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ కారణంగానే మనోడు రష్మికను సపోర్ట్ చేస్తూ వస్తున్నాడట. మరి ఈ గుసగుసని రష్మిక ఎలా తిప్పికొడుతుందో చూడాలి.