భారతీయులు కావచ్చు…విదేశీయులు కావచ్చు…ఏదైనా సందర్భం వచ్చినపుడు “అంతా దేవుడి దయ” అనుకోవడం సాధారణ విషయం. ఎవరికైనా సంతానం జనించినా, ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, ఒక ఇల్లు కట్టుకున్నా “అంతా దేవుడి దయ” అనుకుంటారు. అంతమాత్రాన దేవుడు దిగివచ్చి మనకు పిల్లలు పుట్టిస్తాడని, దేవుడు మన ఊరికి వచ్చి వచ్చి మనకోసం ఇల్లు కట్టిస్తాడని అర్థమా? అలాగే ఏదైనా అశుభం జరిగితే “దేవుడి దయ మామీద లేదు”…” దేవుడు చిన్న చూపు చూశాడు” అని మనల్ని మనం ఊరడించుకోవడం పరిపాటి. అంటే దాని అర్ధం దేవుడు మన మీద పగబట్టి మన ఇంట్లో ఎవరినో చంపేశాడనో, మనం ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రమాదానికి గురి చేశాడనా?
కానీ, “నక్కలు బొక్కలు వెతుకును” అని సామెత చెప్పినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచుగా ప్రయోగించే “దేవుడు కరుణిస్తే” అనే భక్తివాక్యం రాధాకృష్ణ ధృతరాష్ట్ర దృష్టిలో అతిపెద్ద నేరం అయిపొయింది. అందుకే “దేవుడే దిక్కయితే జగన్ ఎందుకు?” అని లా పాయింట్ లాగుతూ వాంతులు చేసుకున్నాడు. బహుశా తన యజమాని, కులగజ్జి పార్టీ తెలుగుదేశం కు మూడు విడతల పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు కాళ్ళు చేతులు, నడుములు విరగ్గొట్టి చీపురుకట్టను మూలన పడేశారని రాధాకృష్ణ కడుపు రగిలిపోతున్నది..ఆ అక్కసునంతా జగన్ మీద కక్కేశాడు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాజ్యసభలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అంగీకరిస్తే సరిపోతుందా? ఇవ్వాల్సింది పార్లమెంట్ లో అధికారపక్షం కదా? మరి మోడీ అధికారంలోకి రాగానే ఎందుకు మాట తప్పారు? మోడీని విమర్శించడానికి రాధాకృష్ణకు నరాలు వణుకుతున్నాయెందుకు? అలాగే అనుభవజ్ఞుడని ప్రజలు చంద్రబాబును నెత్తిన కూర్చోబెట్టుకుంటే, చంద్రబాబు మోదీ కాలర్ పట్టుకుని హోదా తీసుకుని రాకుండా “ప్రత్యేకహోదా వద్దు-పాకేజీ ముద్దు” అని పాకేజీకి లొంగిపోయి హోదాను సమాధి చేసిన విషయాన్నీ రాయడానికి రాధాకృష్ణ పక్షవాత పచ్చపాత కలం ఎందుకు జంకుతోంది? హోదా అంటే జైలుకు పంపిస్తామని, విద్యార్థులు ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొంటే తల్లితండ్రులను జైల్లో పెడతానని తన యజమాని చంద్రబాబు హుంకరించిన విషయాన్ని రాధాకృష్ణ మరచిపోవడం విడ్డూరం కాదా? “హోదా ఇవ్వడం కుదరదు అని నరేంద్ర మోదీ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ‘ఇంకేం చేస్తాం, సర్దుకుపోతాం!’ అని ప్రజలు కూడా రాజీ పడిపోయారు” అని వ్రాయడానికి రాధాకృష్ణ అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా? రాజీ పడింది ప్రజలా? చంద్రబాబా? చంద్రబాబు ప్రత్యేకహోదా విషయమై కేంద్రానికి లొంగిపోయి ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన సంగతి ఆంధ్రులు ఎలా మర్చిపోతారు? చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి అన్యాయం చేసినా కూడా “హోదా కోసం కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాము” అని జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే ఉన్నారు. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రస్తావించారు. చంద్రబాబు ఏనాడైనా ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగినట్లు ఒక సాక్ష్యాన్ని చూపించగలరా రాధాకృష్ణ? రాధాకృష్ణ వంచనాపూరిత మాటలకు మోసపోవడానికి ఆంధ్రులు అంత వెర్రివారు కారు.
అంతెందుకు? ప్రతిపక్షపార్టీకి ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరితో కలిసి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్రమంత్రిని, రాష్ట్రపతిని కలిసి విశాఖ ఉక్కును ప్రయివేటీకరించకూడదని ఎందుకు డిమాండ్ చెయ్యరు? ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని సరిదిద్దడం ప్రతిపక్షం బాధ్యత కాదా? ఎందుకు చంద్రబాబు మొన్న విశాఖలో కనీసం మోడీ పేరును ప్రస్తావించడానికి కూడా వణికిపోయారు? ఎందుకంటే…మోడీని విమర్శిస్తే మరుక్షణమే చంద్రబాబు మీద కోర్టులలో ఉన్న స్టేలు అన్నీ తొలిగిపోతాయి. అవినీతిమీద విచారణలు మొదలవుతాయి. అమరావతి కుంభకోణాలమీద సిబిఐ దిగుతుంది. చంద్రబాబు జైలుకు వెళ్తారు. అందుకే కదా చంద్రబాబుకు మోడీని చూస్తేనే ప్యాంటు తడిసిపోయేది?
ఇప్పుడు రాధాకృష్ణ లక్ష్యం ఏమిటంటే విశాఖ ఉక్కును బూచిగా చూపి రేపు మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొన్ని సీట్లు తెప్పించాలి. అందుకే ఆయన ఈ సమయంలో చంద్రబాబు అసమర్ధ నిర్వాకానికి జగన్ మీద నిందలు వేస్తున్నాడు. వాజపేయి హయాంలోనే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకించామని చంద్రబాబు మొన్న మీడియాతో చెప్పారు. అది అబద్ధమని అందరికీ తెలుసు. ఎందుకంటే వాజపేయి హయాంలోనే రాష్ట్రంలోని యాభై ఆరు పాడి ఆవుల్లాంటి ప్రభుత్వ సంస్థలను తెగనమ్మిపారేసిన చంద్రబాబు విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని వాజపేయికి సలహా ఇచ్చాడంటే మన చెవుల్లో ఎంత పెద్ద కాబేజీ పూవులు పెట్టారో కదా!
.
ఇప్పుడు రాధాకృష్ణ ఆక్రోశం ఏమిటంటే అమరావతి ప్రాంతంలోని మునిసిపాలిటీలు, విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలి. అందుకే ప్రత్యేక హోదాను హత్య చేసిన చంద్రబాబు దుర్మార్గాన్ని జగన్ మీదకు తోసేయాలని తెగ ఆరాటపడుతున్నారు! దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా కితాబులు అందుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలని తాపత్రయపడుతున్నారు. తన వక్రబుద్దికి, వెర్రికి ప్రజలను బలిచేయ్యాలని తహతహలాడుతున్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెపుతూ పొతే అదే నిజమని జనం నమ్ముతారని భ్రమల్లో ఊరేగుతున్నారు. కానీ ఇది సోషల్ మీడియా యుగమని, ప్రజలు రాజకీయనాయకులకన్నా తెలివిగలవారని అర్ధం చేసుకోలేకపోతున్నారు.
“”తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు””
అని భర్తృహరి తన సుభాషితాల్లో వందల ఏళ్ళక్రితమే చెప్పారు కదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు