ముఖ్యమంత్రి అభ్యర్థి పురంధీశ్వరి.?

చంద్రబాబూ కాదు, పవన్ కళ్యాణూ కాదు.. చివరికి నారా లోకేషూ కాదు.! పురంధీశ్వరి అట.! ఔను, మూడు పార్టీలూ ముచ్చటగా కలిసి పోటీ చేయాలంటే.. అన్న కోణంలో భారతీయ జనతా పార్టీ పెట్టిన కండిషన్ ఇదేనంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరికి స్వయానా సోదరి పురంధరీశ్వరి. పైగా, పురంధీశ్వరి గతంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. వాగ్ధాటి వుందాయె.. రాజకీయ వ్యూహాలు రచించడంలోనూ దిట్ట.

సోము వీర్రాజుని తీసేసి, పురంధరీశ్వరికి ఏపీ టీడీపీ పగ్గాలు ఇచ్చిందే, ముఖ్యమంత్రి అభ్యర్థి అనే కోణంలో.. అంటూ అప్పట్లోనే చర్చ జరిగింది. కానీ, చంద్రబాబు ఒప్పుకుంటారా.? ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి ఛాన్స్ వదులుకుంటారా.? నో ఛాన్స్.!

కానీ, పరిస్థితులు వాళ్ళంతా ఒప్పుకునేలా క్రియేట్ చేయగలుగుతోంది బీజేపీ.. తన దత్త పుత్రుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా.. అంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఏం జరిగినా, బీజేపీకి వైఎస్ జగన్ ఎదురెళ్ళే పరిస్థితే లేదు. ఎందుకు.? అన్నది బహిరంగ రహస్యం.

పేరుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కానీ.. నడిపిస్తున్నది బీజేపీ అధినాయకత్వం.. అనే విమర్శలు కొత్తేమీ కాదు. వాటిని వైసీపీలోని చిన్నా చితకా నేతలు ఖండించినా, ఏనాడూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీజేపీ మీద విమర్శలు చేసింది లేదు.

ఇక, పురంధీశ్వరి విషయమై పవన్ కళ్యాణ్‌కీ పెద్దగా అభ్యంతరాలు వుండకపోవచ్చు. సీట్లు గెలిచాక అప్పుడు ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడదాం.. అని పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక వున్న అర్థం అదేనట కూడా.!