Tesla In India: భారత్‌లో టెస్లా ప్లాంట్.. ట్రంప్‌కి ఎందుకంత కోపం?

టెస్లా ఇండియా లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అనేక చర్చలు మొదలయ్యాయి. భారతదేశంలో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఎలాన్ మస్క్ ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పుణెలో ఆఫీస్ ప్రారంభించిన టెస్లా, మహారాష్ట్రలో ప్లాంట్ కోసం స్థలాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఈ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రంప్, మస్క్ కలిసి ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత్ లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు అన్యాయం అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. ప్రపంచ దేశాలు అమెరికాను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రత్యేకంగా భారత్ తన ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని ట్రంప్ అన్నారు.

మస్క్ తన కార్లను భారత మార్కెట్లో విస్తరించడానికి ఫ్యాక్టరీ పెట్టడం వ్యాపార పరంగా సబబే కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థకు మాత్రం నష్టం అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, మస్క్ కార్లను భారత్ లో ఉత్పత్తి చేసి, మళ్లీ అమెరికాకు ఎగుమతి చేస్తే స్థానిక కార్ల తయారీ రంగం ప్రభావితమవుతుందని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ వ్యాఖ్యలతో టెస్లా ఇండియా ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న రాజకీయ ఒత్తిడి మరింత పెరిగింది. ఈవీ విప్లవం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో, టెస్లా వంటి కంపెనీలు మార్కెట్ ను విస్తరించుకోవడానికి సరికొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి. మరి మస్క్ భారత మార్కెట్ ను గెలుచుకుంటారా, లేక ట్రంప్ ఒత్తిడితో వెనకడుగు వేస్తారా అనేది చూడాలి.

పవన్, బీజేపీ ప్లాన్| Senior Journalist Bharadwaj About BJP Politics || Pawan Kalyan | Naga Babu | TR