‘నువ్వు తోపురా’అంటున్న ప్రభాస్

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ సుధాకర్‌ కోమాకుల హీరోగా చేసిన ‘నువ్వు తోపురా’ సినిమా ట్రైలర్‌ ప్రభాస్‌ ఆవిష్కరించారు. బేబి జాహ్న‌వి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘నువ్వు తోపురా’. యునైటెడ్ ఫిలింస్‌, ఎస్‌.జె.కె. ప్రొడ‌క్ష‌న్స్(యు.ఎస్‌.ఎ) ప‌తాకాల‌పై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌రినాథ్ బాబు.బి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మే 3న సినిమా విడుద‌ల‌వుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు.

ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ‘‘సుధాక‌ర్ కోమాకుల హీరోగా చేసిన ‘నువ్వు తోపురా’ సినిమా ట్రైల‌ర్ చాలా బాగుంది. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంద‌ని భావిస్తున్నాను. ఈ సినిమాతో సుధాక‌ర్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘‘మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి ఎంటైర్ యూనిట్‌ను అభినందించిన ప్ర‌భాస్‌గారికి ధన్యవాదాలు. అలాగే అల్లు అర‌వింద్‌గారికి, బ‌న్ని వాసుగారు అందిస్తోన్న స‌హ‌కారానికి ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు. సూరి అనే హైద‌రాబాద్ కుర్రాడి జీవితానికి సంబంధించిన క‌థ‌ ఇది. ఎలాంటి బాధ్య‌త‌లు లేకుండా తిరిగే హీరో.. ఎలా మారాడు. అమెరికా ఎందుకు వెళ్లాడు అనేదే క‌థ‌. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

Nuvvu Thopu Raa Theatrical Trailer || Sudhakar Komakula, Nitya Shetty || B Harinath Babu