‘సలార్’ సంగతులేంటి.. ‘ఆదిపురుష్’ పరిస్థితేంటి.? ‘ప్రాజెక్ట్ – కె’ ఏమయ్యింది.? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదుగానీ, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గురించి మాత్రం అప్డేట్స్ పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి.
వేగంగా నిర్మితమయ్యే సినిమాలకు వుండే కిక్కు ఇది. ఎప్పుడైతే ‘బాహుబలి’కి ఓకే చెప్పాడో, ఆ తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం తగ్గిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా, వెంట వెంటనే సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతున్నాడు. చేతిలో చాలా సినిమాలున్నాయ్.
మారుతి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయ్యాక, ప్రభాస్ ఆలోచనలు వేగంగా మారిపోతున్నాయట. చిన్న సినిమా అని అనలేంగానీ, వేగంగా నిర్మితమయ్యే సినిమాలవైపు ప్రభాస్ ఆసక్తితో వున్నాడట.
గ్యాప్ దొరికితే, మరో చిన్న సినిమాని పట్టాలెక్కించేయడానికి ప్రభాస్ సిద్ధంగా వున్నాడని సమాచారం. చిన్న సినిమా అంటే ప్రభాస్ దృష్టిలో వంద కోట్లు ఆ పైన. అయినాగానీ, తక్కువ డేట్స్‌తో సినిమా వేగంగా తెరకెక్కి, ప్రేక్షకుల ముందుకొస్తే చాలన్నది ప్రభాస్ ఆలోచన. పెద్ద సినిమాల గ్యాప్‌లో ఈ చిన్న సినిమాలొచ్చేస్తే.. కెరీర్‌లో వేగం తగ్గినట్లు అనిపించదు.