సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ మధ్య ఒకప్పుడు పొలిటికల్ వార్ నడిచిందా? ఆ వార్ కారణంగా నటకిరిటీ హీరో అవకాశాన్ని కోల్పోయారా? ఇందులో కుల రగడ కూడా ఉందా? అంటే అవుననే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1996లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా `కలియుగంలో గందరగోళం` అనే ఓ సినిమా ప్రారంభమైంది. ఆ చిత్రానికి సీనియర్ కోడైరెక్టర్ సోమరాజు దర్శకత్వం వహించారు. అప్పటికే ఇండస్ర్టీలో సోమరాజు కి కో డైరెక్టర్ మంచి పేరుంది. పరిశ్రమ పెద్దలతోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఏడాది ఎలాగైనా సినిమా డైరెక్ట్ చేయాలని తానే స్వయంగా కథ రాసుకుని సర్వం సిద్దం చేసాడు. హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని పెట్టి చాలా సన్నివేశాలు కూడా పూర్తిచేసారు.
అయితే అనూహ్యంగా రాజేంద్రప్రసాద్ స్థానంలో కమెడియన్ అలీ వచ్చి చేరాడు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ పై తీసిన సన్నివేశాలు అన్ని మళ్లీ మొదటి నుంచి అలీపై షూట్ చేసి 1997లో ఆ చిత్రాన్ని రిలీజ్ చేసారు. మరి ఇలా రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? అది ఇద్దరి మధ్య రేగిన పొలిటికల్ వార్ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1996లోనే పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ టీడీపీ తరుపున మచిలీపట్నం నుంచి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఆ పార్టీ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు. కైకాల ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది.
ఆ తర్వాత ఆ ఇద్దరు `కలియుగంలో గందరగోళం` సినిమా సెట్స్ లో అనుకోకుండా కలిసారు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ మీ విజయంలో నాది కీలక పాత్ర అంటూ కైకాలతో అన్నారు. అందుకు కైకాల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేవలం థాంక్స్ అనే మాట రాజేంద్రప్రసాద్ కు నచ్చలేదు. ఇంకా బెటర్ గా కాంప్లిమెంట్ వస్తుందని భావించారు. తన గౌరవ, మర్యాదలకు భంగం కలిగినట్లుగా ఫీలయ్యాడుట. కైకాల చాలా సింపుల్ గా థాంక్స్ తో సరిపెట్టడంతో నటకిరిటీకి అస్సలు నచ్చలేదుట. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగిందిట. అక్కడితే ఆగితే పర్వాలేదు. కులాల గురించి కూడా ప్రస్థావన వచ్చిందిట.
ఆ గోడవ కారణంగా ఏకంగా సినిమా షూటింగ్ ఆగిపోయిందిట. ఆ సమయంలోనే రాజేంద్రప్రసాద్ ని సినిమా నుంచి తప్పించారు. ఎందుకు అలా జరిగిందంటే? దర్శకుడు సోమరాజు కైకాలకు బాగా కావాల్సిన వాడుట. ఆ కారణంగా రాజేంద్ర ప్రసాద్ ని తప్పించి అలీని రంగంలోకి దించినట్లు తెలిసింది. రాజేంద్రప్రసాద్ కు వివాదాలు కొత్తేం కాదు. ఆయన `మా ` అధ్యక్షుడి పదవి చేపట్టిన సమయంలోనూ ఇలాంటి వివాదం ఒకటి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అదిష్టానంతో ఇబ్బందులు రావడంతో వాటిని సరిద్దిద్దుకోకుండా పదవిలో ఉండగానే కార్యాలయానికి రావడం మానేసారు.