ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ప్రధాని కార్యాలయం (PMO) ఓ ప్రకటనను విడుదల చేసింది.
ప్రధాని మోదీ పర్యటన వివరాలు:
ఉదయం 7:50 గంటలకు: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బయల్దేరనున్నారు.
ఉదయం 10:20 గంటలకు: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు బయలు దేరుతారు.
ఉదయం 11:10 గంటలకు: రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కి చేరుకోనున్నారు.

ఉదయం 11:45 గంటలకు: శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.
మధ్యాహ్నం 1:40 గంటలకు: సున్నిపెంటలోని హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు: రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం: రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో నిర్వహించే ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
సాయంత్రం 4 గంటల వరకు: బహిరంగ సభలో ప్రసంగం కొనసాగుతుంది.
అనంతరం: కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా యంత్రాంగం, భద్రతా సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

