ప్రస్తుతం పవన్ లక్ష్యం జగన్ ని గద్దె దింపడమో.. చంద్రబాబుని గద్దె నెక్కించడమో.. అసెంబ్లీ గేటు తాకాలనే కోరికను తీర్చుకోవడమో మాత్రమే అనుకుంటే పొరపాటే! మహిళల్లో విపరీతంగా ఉందనిచెబుతున్న వ్యతిరేకతను ఎంతో కొంత తగ్గించుకోవడం కూడా ఇప్పుడు పవన్ కు చాలా ముఖ్యం. ఇందులో భాగంగా… ప్రస్తుతం మహిళలపై పవన్ సూక్తిముక్తావళి చెబుతున్నారు.
అవును… మహిళలపై తనకు విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని చాటుకోడానికి జనసేనాని పవన్ కల్యాన్ తెగ పరితపిస్తున్నట్లున్నారు. ఆయన బాధ, ఇబ్బందిని అర్థం చేసుకోదగ్గవే అయినప్పటికీ… ఎంతమంది నమ్ముతారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎవరితో ఎన్ని రికమండేషన్స్ చేయించినా.. అవి ఏపీ మహిళలు మొత్తం నమ్మాల్సిన అవసరం లేదుగా అనేది మరో ప్రశ్న!
కారణం… మెజార్టీ మహిళా లోకం పవన్ కల్యాణ్ ను చూసే దృష్టి వేరని అంటుంటారు. మహిళలపై గౌరవం లేదని, అందుకే వారిని కేవలం శారీరక వాంఛలు తీర్చుకునే వారిగా భావించడం వల్లే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. పైగా బహిరంగ సభల్లో కూడా… తనను మూడు పెళ్లిల్లు అంటుంటారని… కావాలంటే మీరు కూడా మూడు కాకపోతే ముప్పై చేసుకోండని వ్యాఖ్యానించిన సంగతులను గుర్తుచేస్తుంటారు.
సమాజంపై కాస్త అయినా భాధ్యత, మహిళా లోకంపై కాస్త అయినా ఇంగితం ఉండి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెబుతుంటారు. చంద్రబాబు హయాంలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వ్యవహారం కలకలం రేపిన సమయంలో పవన్ ఎక్కడున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దురుసు ప్రవర్తన సమయంలో పవన్ ఏ కొలుగులో ఉన్నారని కామెంట్లు చేశ్తున్నారు.
అలాంటి పవన్ కల్యాణ్ తాజాగా మైకందుకున్నారు… మహిళ కన్నీళ్లు తుడవలేని జగన్ ప్రభుత్వానికి 151 స్థానాలు ఇచ్చి లాభం ఏంటని ప్రశ్నించారు. తనకు అధికారం లేకపోయినప్పటికీ, మహిళల బాధలపై స్పందించే మనసు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తాడేపల్లిలో క్రైమ్ రేటు ఎక్కువగా వుందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవడో కాలరాస్తే చూస్తూ ఊరుకుంటామా? అని ఆయన ప్రశ్నించారు.
ఇదే సమయంలో మహిళలను గౌరవించడం మన కనీస సంప్రదాయం అని ఆయన పవన్ చెప్పుకొచ్చారు. శాంతిభద్రతలు అనేవి జనసేన పార్టీ దృష్టిలో కీలకమని అన్నారు. అయితే తాజాగా పవన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఇంతకూ శాంతి ఎవరు, భద్రత అనే అమ్మాయిలు ఎవరని నెటిజన్లు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
కాగా… నాలుగురోజుల క్రితం పవన్ కల్యాణ్ గురించి తన మాజీ రెండో భార్య సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ తనకు అన్యాయం చేశారనే విషయంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. దీంతో… కట్టుకున్న భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోని మహిళాలోకాన్ని ఉద్దరిస్తాడంట అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!