సంక్రాంతికి తన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల కాబోతోంది. ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 154 సినిమాలు చేసిన చిరంజీవికి, ఇదేమీ కొత్త కాదు. కాకపోతే, బాక్సాఫీస్ లెక్కలు మారాయ్. ‘ఆచార్య’ దెబ్బతినేసింది. ‘గాడ్ ఫాదర్’ ఎలాగోలా గట్టెక్కింది.
‘వాల్తేరు వీరయ్య’ ఏమవుతుంది.? దీనికి ఓ వైపు నుంచి ‘వీరసింహారెడ్డి’ రూపంలో పోటీ వుంది. మరోపక్క, తమిళ సినిమాలు రెండు, డబ్బింగ్ రూపంలో తెలుగు సినిమాల్ని భయపెడుతున్నాయి. వాటికి అంత సీన్ వుంటుందని కాదు. నిర్మాత దిల్ రాజు, డబ్బింగ్ సినిమా ‘వారిసు’ని టాలీవుడ్ మీద బలవంతంగా రుద్దుతున్నాడు.
ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు ‘వాల్తేరు వీరయ్య’ని దెబ్బ కొడతాయేమోనని చిరంజీవి ఆందోళన చెందుతున్నారట. మధ్యలో భారత్ రాష్ట్ర సమితి గొడవ ఒకటి. బీజేపీ సంగతి సరే సరి. నాకు రాజకీయాలతో సంబంధంలేదు మొర్రో.. అని చిరంజీవి అంటున్నా, ఆయన్ని ఓ సెక్షన్ మీడియా, పవన్ కళ్యాణ్‌ని ముందు పెట్టి రాజకీయాల్లోకి లాగుతోంది.
ఆ రాజకీయ ప్రభావం పడకుండా ఎలా.? అంటే అది చిరంజీవి చేతుల్లో లేదు. అందుకే చిరంజీవి గతంలో ఎన్నడూ లేనంతలా టెన్షన్ పడుతున్నారట ‘వాల్తేరు వీరయ్య’ కోసం.