బ్రదర్ చిరంజీవి.? బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవన్తో ఇదే కీ-పాయింట్.!

త్వరలో, అతి త్వరలో నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం ‘ఆహా’ టీమ్ ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్.. లేదంటే, క్రిష్ – పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోలో సందడి చేయొచ్చు.

కాగా, దర్శకుడు ఎవరున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం కాస్సేపే ఆ వేదికపై కనిపిస్తారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ హాటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఇదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి కూడా సందడి చేస్తారట. అయితే, భౌతికంగా కాదు.. వర్చువల్వి ధానంలోనట.!

ఫోన్‌లో పవన్ కళ్యాణ్ ద్వారా చిరంజీవితో బాలకృష్ణ మాట్లాడబోతున్నారనీ, దాన్ని ఆ వేదికపైనే లైవ్ చూపించబోతున్నారనీ సమాచారం. సినీ, రాజకీయ అంశాల గురించి ఈ టాక్ షోలో కొన్ని పాయింట్స్ ప్రస్తావనకు వస్తాయట.

‘బ్రదర్ చిరంజీవీ..’ అంటూ బాలయ్య ఆప్యాయంగా చిరంజీవిని పలకరించబోతున్నారట.