షారుక్ ఖాన్.. ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉన్నారంటే నమ్మడం కాస్త కష్టమే. అయితే అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బారీ కలెక్షన్లు వసూలు చేసిన ఈయన… గత కొంత కాలంగా వరుస పరాజయాలతో తెగ ఇబ్బంది పడిపోయాడు. కానీ తాజాగా రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ సినిమా వంటి టాక్ సొంతం చేసుకుంది. భారీ వసూళ్లను రాబడ్తూ… బాక్సాఫీసను బద్దలు కొడుతోంది.
అయితే భారీ అంచనాలు మధ్య జనవరి 25వ తేదీన విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 7700 స్క్రీన్స్ లో విడుదల కాగా అందులో ఇండియాలో 5200, ఓవర్సీస్ 2500 ఉన్నాయి. ఇక ఈ సినిమాతో ఇటు బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. మొదటి రోజే ఏకంగా 57 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టోటల్ కలెక్షన్లలో ఒక్క హిందీ వెర్షన్ 55 కోట్లు కాగా తమిళ్, తెలుగులో కలిసి 2 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి.
ఇక ఈ సినిమా టోటల్ ఇండియా గ్రాస్ 70 కోట్లకు పైగా వచ్చిందని.. తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు. ఇక ఈ సినిమా రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టనుంది. రిపబ్లిక్ డే రోజు కాబట్టి మరోసారి ఈ సినిమా 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వసూలు చేయొచ్చు. రెండు రోజుల్లో 100 కోట్లు రాబట్టే అవకాశం కూడా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టి వావ్ అనిపించింది.
వార్(రూ.53.35 కోట్లు), థగ్స్ ఆఫ్ హిందూస్థాన్(రూ.52.25 కోట్లు) వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమా వసూళ్లను కూడా దాటిన ఈ చిత్రం.. ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తోంది. రెండో రోజు 65 కోట్ల రూపాయలతో దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. గుండెల నిండా దేశభక్తి ఉన్న రా ఏజెంట్ గా షారుఖ్ సూపర్ గా నటించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత షారుఖ్ నటంచిన సినిమా కావడంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.