తెలంగాణ బీజేపీ బండికి సంజయ్ ఒక్కడే డ్రైవర్

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా మారింది తెలంగాణ బీజేపీ పరిస్థితి….అధికారం దరిదాపుల్లో లేకున్నాఓ అధికారి పార్టీకి ఉండాల్సిన లక్షణాలన్నీ అలవర్చుకుంటోంది. తెలంగాణ బీజేపీ పార్టీలో అసలు కోర్ కమిటీ ఉందా లేదా అనేది కూడా తేలవడం లేదు. కొంత మంది మేం కోర్ కమిటీ సభ్యులమని ప్రచారం చేసుకుంటూ ఉంటే వాళ్ల వ్యతిరేక గ్రూప్ అసలు కోర్ కమిటీయే లేదని ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా 8 నెలలుగా కోర్ కమిటీ సమావేశం కాకపోవడం మరో విశేషం.

తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చి నెలలు గడుస్తున్నా కోర్ కమిటీ ఊసే ఎత్తడం లేదు. కొత్త అధ్యక్షుడి రాకతో పాత కమిటీలన్నీ రద్దు అయినట్లే అని కొంత మంది ప్రచారం చేసుకుంటూ ఉంటుంటే… రద్దు చేస్తున్నట్లు సర్క్యూలర్ జారీ చేస్తే తప్ప రద్దు కాదని మరికొంత మంది ప్రచారం చేస్తుకుంటున్నారు. కోర్ కమిటీ సమావేశం కానున్నా తామంతా కోర్ కమిటీ సభ్యులమని ప్రచారం చేసుకుంటున్నారు మరి కొంత మంది. ఇంత జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఈ అంశంపై పెదవి విప్పడం లేదు.

లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఐదుగురు మాత్రమే కోర్ కమిటీలో సభ్యులుగా ఉండే వారు. మురళీధర్ రావు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయతో పాటు శ్రీనివాసులు కోర్ కమిటీలో ఉండే వాళ్లు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆహ్వానిత సభ్యులుగా మాత్రమే ఉండే వాళ్లు.
అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర బీజేపీలో చేరారు. వస్తూ వస్తూనే తమ స్థాయికి తగ్గట్లుగా కోర్ కమిటీలో స్థానం కల్పించాలని ఒత్తిడి చేయడంతో కోర్ కమిటీ సంఖ్య పెరుగుతూ పెరుగుతూ 23కు చేరింది.

నేతల ఒత్తిడిని తట్టుకోలేక అధికారంలో ఉన్న పార్టీ జంబో క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు రాష్ట్ర బీజేపీ కూడా ఇలా జంబో కోర్ కమిటీని ఏర్పాటు చేసుకుంది. అందడీ సంగతి. అయితే గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఈ జంబో కోర్ కమిటీని చూసి ఆశ్యర్యపోయారంటా. ఇకపై ఎవర్ని కోర్ కమిటీలోకి తీసుకోవద్దని హెచ్చరించారంటా. అయితే దీన్ని సాకుగా చేసుకొని కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ కోర్ కమిటీ ఊసే ఎత్తడం లేదంటా. అంతా తానై నడిపిస్తున్నారంటా.


ఇది ఇలా ఉంటే చాలా మంది ఇంకా తాము కోర్ కమిటీ సభ్యలమే అంటూ హడావిడి చేస్తూ ఉనికి చాటుకుంటున్నారంటా…ఇవేమి పట్టించుకోని బండి సంజయ్ అంతా తానై తమ గ్రూపులో పార్టీ వ్యవహారాలు చక్క బెడుతున్నారంటా. అదండి సంగతి.