ఇప్పుడేం చేద్దాం..టీడీపీ జెండా పీకేద్దామా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన నేప‌థ్యంలో నేటి..నాటి ప‌చ్చ మీడియా ఎలా విషం గ‌క్కిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అప్పటికే రెండు సామాజిక వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైన పెత్తనం కోసం మ‌రో సామాజిక వ‌ర్గం పోటీకి దిగుతుందా? అంటూ క‌ళ్లెర్రజేసాయి. ఆ రెండు ప‌త్రిక‌లు ఎలాగైనా చిరంజీవిని రాజ‌కీయాల‌లో ఎద‌గ‌నీయ‌కూడ‌దని అప్ప‌టి రాజ‌కీయ పార్టీలో మేమ‌క‌మై కుట్ర‌లు చేసాయి. కుతంత్రాలు ప‌న్నాయి. ప్ర‌జారాజ్యంపై లేని పోని ఆరోప‌ణ‌లు, నింద‌లు, విమ‌ర్శ‌లు వేసి పార్టీ ప‌త‌నాన్ని కాంక్షించాయి. ముఖంగా ఒక సామాజిక వ‌ర్గం మాత్రం చిరంజీవి సీఎం అవుతారా? అంటూ హేళ‌న చేసాయి. అలాంటి క‌ల‌ల‌న్నీ సినిమాల్లోనే సాధ్యం అవుతాయి.

నిజ జీవితంలో అవ‌న్నీ క‌ల‌లుగానే మిగిలిపోతాయ‌ని ఇష్టానుసారం క‌థ‌నాల్ని ప్ర‌చారం చేసాయి. త‌మ‌కున్న మీడియా బ‌లం చూసుకుని కండ‌కావరా‌న్ని ప్ర‌ద‌ర్శించాయి. తెలుగు దేశం పార్టీ ఉండ‌గా మ‌రో రాజ‌కీయ పార్టీనా! అంటూ జ‌బ్బ‌లు చ‌రిచి..కాల‌రెగ‌రేసాయి. చిరంజీవి పార్టీ స్థాపించిన ద‌గ్గ‌ర నుంచి కాంగ్రెస్ లో విలీనం చేసే వ‌ర‌కూ పార్టీ ప‌త‌నానికే పాటు ప‌డ్డాయి. పార్టీ విలీనం అయ్యే వ‌ర‌కూ రేయింబ‌వ‌ళ్లు తేడా లేకుండా ఆ రెండు ప‌త్రిక‌లు ఎంతో శ్ర‌మించాయి. ప్ర‌జారాజ్యం పార్టీని ఒక సామాజిక వ‌ర్గానికి అంట‌గ‌ట్టి విష ప్ర‌చారానికి పూనుకున్నాయి. చివ‌రికి ఆప‌త్రిక‌లు కోరుకున్న‌ట్లే జ‌రిగింది. 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప్ర‌జారాజ్యం పార్టీ అత్య‌ల్పంగా 18 సీట్ల‌నే ద‌క్కించుకుని ఓట‌మిపాలైంది. ఆ త‌ర్వాత పార్టీని 2010లో కాగ్రెస్ లో విలీనం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే చిరంజీవి విలీన నిర్ణ‌యం తీసుకున్న అనంత‌రం ప‌చ్చ మీడియా క్ష‌మించ‌రాని క‌థ‌నాలు ప్ర‌చారం చేసింది. ప్ర‌జారాజ్యం జెండా పీకెద్దామా? అంటూ నైతిక విలువ‌లు లేని రాతలు రాసింది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి అదే ప‌రిస్థితి వ‌చ్చింది అన్న‌ది వాస్త‌వం. టీడీపీ ప‌రిస్థితి అలాగే ఉంద‌ని సోష‌ల్ మీడియాలో సైతం జోరుగా ప్ర‌చారం సాగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో 23 సీట్లు గెలుచుకున్న టీడీపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైకాపాలోకి జంప్ అవుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ప‌డిన ఓట్లు చూసుకుంటే ఆ పార్టీ కింద ఉన్న ఎమ్మెల్యేలు 17..18 అని తెలుస్తోంది. అందులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వాని త‌ప్పుగా ఓటు వేసాన‌ని త‌ప్పించుకున్నారు.

ఆ ఓటు తీసేసినా టీడీపీకి లెక్కకి వ‌చ్చిన ఓట్లు 17. అంటే ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి నాటి ప్ర‌జారాజ్యం క‌న్నా అత్యంత ఘోరంగా ఉంద‌న్నది వాస్త‌వం. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన తేదాపా చివ‌రికి చంద్ర‌బాబు నాయుడు చేతుల్లోకి వ‌చ్చిన త‌ర్వాత 17 సీట్ల‌కు ప‌రిమిత‌మైంది. ఇది టీడీపీ చ‌రిత్ర‌లోనే అత్యంత చెత్త రికార్డు అని అంద‌రికీ తెలుసు. ఇప్ప‌టికే ఆ పార్టీ ఇక దుకాణం స‌ర్దేయాల్సిందేన‌ని వైకాపా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ జెండా పీకెద్దామా? అంటూ ఓ సామాజిక వ‌ర్గం సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం చేస్తోంది. నాటి ప‌చ్చ మీడియా క‌థ‌నాల్ని హైలైట్ చేస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. దెబ్బ‌కు దెబ్బ స‌రిపోయిందంటూ మండిప‌డుతున్నారు.