నల్లారి వారి అల్లరితో జట్టు పీక్కుంటున్నచంద్రబాబు

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి…మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు. అన్నముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు. ఇక చిత్తూరు జిల్లాలో అయితే ఆయన మాటే వేదంగా నడిచింది. అలాంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తమ పార్టీకి వస్తున్నారని తెలిసి చంద్రబాబునాయుడు ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. జిల్లాలో మరింత బలపడొచ్చని కలలు కన్నారు. చిత్తూరు జిల్లాలో రెడ్ల ఓట్లను కమ్మ పార్టీకి మార్చొచ్చని ఆకాంక్షించారు. పీలేరు టిక్కెట్టు అడగ్గానే పువ్వులో పెట్టి మరీ ఇచ్చారు. కాని పార్టీ ఓటపోయిన తర్వాత సదరు ముఖ్యమంత్రి తమ్ముడు కనిపించకుండా పోయారు. దీంతో పీలేరులో పార్టీ వ్యవహారాలు చూసే నాథుడు లేకుండా పోయాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అన్నా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పత్తా లేకుండా పోతే తమ్ముడు నల్లారి కిషోర్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు. పిలిచి టిక్కెట్ ఇస్తే పీలేరులో తెడ్డు చూపించారని టీడీపీ అధినేత చంద్రబాబు బాగా ఫీల్ అవుతున్నారని టాక్. ఈ వ్యవాహారంతో పీలేరులో పచ్చ పార్టీ పరిస్థితి గాలిలో పెట్టిన దీపం అన్న చందాన తయారైంది.

రాష్ట్ర విభజన తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మొదట అన్న స్థాపించిన చెప్పుల పార్టీ నుంచి పోటీ చేసి సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలయ్యారు. ఇక ఆతర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోవడంతో అన్నగారి నాన్చుడు ధోరణి చూసి చూసి ఓపిక నశించి తమ్ముడు గారు టీడీపీలోకి జంప్ అయ్యారు. తమ్ముడొస్తే అన్న రాకపోడా అన్న ఆశతో చంద్రబాబు చాలా కాలం పాటు ఎదురు చూశారంటా … కాని జగమొండి కిరణ్ మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటూ క్రియాశీలక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.

దీంతో అన్నకు గాలం వేసేందుకు కిషోర్ కుమార్ రెడ్డికి హౌసింజ్ కార్పోరేషన్ పదవి కట్టబెట్టి చంద్రబాబు కీలక మైన పదవి బూడితో పోలిన పన్నీరులా మారిందే అని చాలా ఫీల్ అయ్యారంటా. ఇది ఇలా ఉండగా…. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఒక్క కుప్పం నియోజకవర్గంలో తప్ప మిగతా అన్ని చోట్ల టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో సొంత జిల్లాలోనే పార్టీకి పట్టిన దుస్థితిని చూసి చంద్రబాబు లోలోపల మదనపడిపోతున్నారంటా.

నల్లారి కిషోర్ రెడ్డి కూడా హ్యాండ్ ఇవ్వడంతో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో పడ్డారు టీడీపీ అధినేత. నల్లారి వారి కోసం సొంత మనుషులైన పచ్చ క్యాడర్ ను దూరం చేసుకున్నందుకు తగి శాస్తే జరిగిందని ఫీల్ అవుతున్నారంటా చంద్రబాబు .