కొవిడ్-19 దెబ్బకి దేశ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటున్న పరిస్థితులు. అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు దేశం ఆర్ధికంగా ముందుకు సాగాలంటే కేంద్ర నిర్ణయాలు ఎంతో కీలకంగా ఉండాలి. దేశాన్ని ఆర్ధికంగా పురోగతి వైపు నడిపంచాలంటే? ఆర్ధిక శాఖ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు అత్యంత కీలకం కానున్నాయి. పడిపోయిన జీడీపీని వృద్ధిలోకి తీసుకురావాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పదవికి నిర్మలా సీతారామన్ కరెక్టే నా? అన్న సందేహాల నడుమ కేంద్ర వర్గాల నుంచి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి నిర్మలా సీతారామన్ ని తప్పించే దిశగా కేంద్ర సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
నిర్మలా సీతారామన్ ని తప్పించి ఆమె స్థానంలో సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్ తో ఆ శాఖను భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. బ్యాకింగ్ రంగంలో కామత్ కు ఉ న్న ఆపార అనుభవం…విదేశీ బ్యాకుల వ్యవహారాలు డీల్ చేయడంలో కామత్ తి అంది వేసిన చేయి. ఈ నేపథ్యంలో కేంద్రం కామత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బ్రిక్స్ దేశాల న్యూ బెవలప్ మెంట్ బ్యాంక్ చీఫ్ గా ఇటీవలే ఐదేళ్ల పదవి కాలాన్ని కామత్ పూర్తిచేసుకున్నారు. ఇప్పుడా స్థానంలో కొత్త వ్యక్తిని నియమించనున్నారు. ఈ నేపథ్యంలో కామత్ ఆర్ధిక శాఖకు సరైన వ్యక్తిగా కేంద్రం భావిస్తోందిట.
కరోనా కారణంగా భారత ఎకానమీ ఘోరంగా దెబ్బతిన్నది. అటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్ధిక శాఖలో అనుభవం లేని వాళ్లను నియమించడం అందుకు ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటివి ఆర్ధిక మందగమనానికి కారణాలగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ శాఖను సమర్ధులకు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని కేంద్రం సైతం భావిస్తోందిట. మరి ఇదే సమయంలో భారత తొలి మహిళా ఆర్ధిక మంత్రిగా రికార్డు సాధించిన నిర్మలమ్మనే తప్పిస్తారా? అన్న విమర్శలు అంతే వేగంగా వినిపిస్తున్నాయి. భాజాపాలో సీనియర్ మహిళా నేత. మోదీ సర్కార్ లో నిర్మలమ్మకు మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. మరి అదిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.