నిమ్మగడ్డ కథ (సశేషం), ఇకపై డైలీ సీరియల్!!

Nimmagadda Ramesh Kumar

హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ…. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలన్న గవర్నర్ ఉత్తర్వును…. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తుందా అన్నది ఇప్పటి ప్రశ్న. ఈ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందు వల్ల సుప్రీం తీర్పు వచ్చే వరకు నిమ్మగడ్డను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేయవచ్చు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ పై హైకోర్టు గవర్నర్ కు సూచనలు చేయడం తగదని, గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వు చెల్లదని ప్రభుత్వం వాదించే అవకాశముంది. నిమ్మగడ్డను ప్రభుత్వం ఎస్ ఇసిగా నియమించకపోతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Read More : ఆర్జీవీ అరాచ‌కం.. మామూలుగా లేదుగా..!

రాజ్యాంగంలోని 243 (కె) అధికరణం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం గవర్నర్ కు ఉంది.  గవర్నర్ తాజా ఉత్తర్వును తాత్కాలికంగా  పక్కన పెట్టడానికి జగన్ ప్రభుత్వానికి అవకాశమున్నా మరీ అంత పట్టుదలకు పోయి నిమ్మగడ్డను అడ్డుకోవాల్సిన అవసరముందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

నిమ్మగడ్డ కేసులో తమ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టు నిర్ణయించేంత వరకు వేచి ఉండాలని ఏ నిబంధన లేదని నాలుగు రోజుల క్రితం హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ వాక్యం కీలకమైనదిగా కనిపిస్తోంది.

Read More : బిగ్‌బాస్ సీజ‌న్ 4 : ఫైన‌ల్ లిస్ట్ అవుట్..?

దీని ప్రకారం సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చే వరకు హైకోర్టు ఆదేశం మేరకు గానీ, గవర్నర్ ఉత్తర్వు మేరకు గానీ నిమ్మగడ్డను నియమించడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం చేసే వాదన నిలబడక పోవచ్చు. కొందరు రాజకీయ నాయకులు, న్యాయవాదులు ఈ విషయంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశముందని అంటున్నారు గానీ ఇది హైకోర్టుకు , సుప్రీం కోర్టుకు మధ్య నలుగుతున్న సమస్యగానే కనిపిస్తోంది. సుప్రీం కోర్టు తుది తీర్పు తర్వాత, ఈ ఒక్క కేసు  పైనే కాకుండా ఎస్ ఇసిల అర్హతలు, నియామక నిబంధనలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Read More : అంబ‌టి రాంబాబు కి క‌రోనా..గుంటూరులో మూడ‌వ ఎమ్మెల్యే

ఇక రాజకీయాల వరకు వస్తే నైతిక నిబంధనలు, మంచి, చెడు, ప్రజా శ్రేయస్సు వంటి ఎన్నో విషయాలు చర్చకు వస్తాయి. తెలుగుదేశం మనిషిగా ముద్రపడిన నిమ్మగడ్డతో జగన్ ప్రభుత్వం ఏ విధంగా ఇమిడిపోయి పని చేయించగలదు ? తనకు గల అధికారాలను నిమ్మగడ్డ ఉపయోగిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహించగలదా? రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఎన్నికల కమిషనర్ ఏ పనీ చేయలేరు. సిబ్బంది మాట అటుంచి ఆయనకు అటెండర్ ను కూడా ఇవ్వకుండా చేయవచ్చు. నిమ్మగడ్డ పదవీ కాలం కొన్ని నెలలు మాత్రమే ఉంది. అంత కాలం ఆయనను కొనసాగించి జగన్ ప్రభుత్వం తన “మంచి” తనాన్ని చాటుకోవచ్చు. న్యాయ పోరాటంలో తానే గెలిచానని సంతృప్తి పడి, నిమ్మగడ్డ  నిమ్మకుండి తప్పుకోవచ్చు. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చి, అది ఆయనకు అనుకూలంగా ఉన్నా, తీవ్ర ప్రతికూల పరిస్ధితుల్లో నిమ్మగడ్డ తన ఉద్యోగం చేసుకోలేరు. తనకు పెన్ను ఇవ్వడం లేదని, తనకు అటెండర్ ను ఇవ్వలేదని ఆయన మాటి మాటికీ పిటిషన్లు వేసుకుంటూ పోగలరా? దీనికి అంతమెక్కడుంది?

—-శాంతారామ్