సిద్ధాంతం కన్నా రాద్దాంతమే బెటర్ అంటా

తెలంగాణలో బలపడేందుకు సిద్ధాంతం కన్నా రాద్దాంతమే బెటర్ అని డిసైడ్ అయింది బీజేపీ అధిష్టానం. అందుకే పార్టీలో సీనియర్లు ఉన్నా జూనియర్లతోనే పని కానిచ్చేయాని భావిస్తోంది. ఆవేశపూరిత ప్రసంగాలతో నిప్పులు రాజేసే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లను అందుకే కేంద్ర నాయకత్వం ఎంకరేజ్ చేస్తోంది.

కాషాయ దళాధిపతులు వదిలిసిన ఈ రెండు బుల్లెట్లు ఇప్పుడు తెలంగాణలో హల్ చల్ చేస్తున్నాయి. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంసభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కమలవికాశానికి పాటుపడుతున్నారు ఈ ఫైర్ బ్రాండ్ లీడర్లు.

యూపీ తరహాలో తెలంగాణలో బలపడేందుకు అగ్గిరాజేయాల్సిందే అని పార్టీ అధిష్టానం వీరిని ఆదేశించిందట. కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలకు కేంద్రంలో అత్యున్నత పదవులు దక్కినా రాష్ట్ర బీజేపీలో వీరిద్ధరి హాడావిడే నడుస్తోంది. కాషాయదండును ఇమేజ్ ను పెంచేందుకు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు వీళ్లిద్దరు. యంగ్ లీడర్లకు ఇప్పుడే పగ్గాలు ఇస్తే భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడతారనే ఆలోచనతోనే అమిత్ షా వీరిని ఎంకరేజ్ చేస్తున్నారు. అధినేత అండ దొరకడంతో ఈ మిత్రద్వయం ఫక్కా ప్లాన్ తో ముందుకు పోతోంది.

రాష్ట్ర బీజేపీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన వాళ్లను కాదని వీళ్లను ఎంకరేజ్ చేస్తే కొత్తగా ఒరిగేముంటుందని భావన మొదట్లో ఉన్నా అది ఇప్పుడు మారిపోయింది. వీరిద్ధరి హడావిడితో గతంలో పోల్చితే బీజేపీకి కాస్తో కూస్తో జవసత్వాలు వచ్చాయి.

అయితే ఇద్దరు కాపు సామాజిక వర్గానికే చెందిన వాళ్లు కావడంతో వీరి మధ్య దోస్తీ కూడా బాగా కుదిరింది. తమ సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీరిద్ధరు పార్టీని మెళ్లి మెళ్లిగా హస్తగతం చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. అందుకే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాట చేయకుండా నాన్చుతూ వస్తున్నారని సమాచారం.

పార్టీలో లక్ష్మణ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నా… పార్టీ లైన్ అంతా వీళిద్ధరే డిసైడ్ చేస్తున్నారు. అవసరం అయితే స్ట్రీట్ ఫైట్ కు కూడా దిగుతున్నారు. హిందుత్వ అజెండానే నెత్తిన ఎత్తుకొని ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్ర పార్టీని తమ ఫార్మాట్ లోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలను ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్తేనే భవిష్యత్తులో పార్టీ తమ అదుపులో ఉంటుందని భావిస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటి వరకు సిద్ధాంతాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తే…ఈ మిత్రద్వయం రాద్దాంతం చేసి అయినా పార్టీని బలపర్చాలని చూస్తోంది. ముఖ్యంగా వీళ్లిద్ధరికి యూత్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ ఇమేజ్ కలిసి వస్తోంది. చూడాలి మరి ఎంత వరకు సక్సెస్ అవుతారో. అర్బన్ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమేరకు రానిస్తుందో తేలితే కాని వీళ్ల ప్యూహరచనపై ఓ అంచనాకు రాలేం.