తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చేసిన రెండు రకాల వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో ఒకటి వైఎస్సార్ గురించి కాగా.. మరొకటి చంద్రబాబు గురించి కావడం గమనార్హం.
అవును… తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఆరోగ్యశ్రీకి ఆద్యుడు వైఎస్సార్ అని ప్రకటించారు. ఈ సందర్భంగా నాడు వైస్సార్ పెట్టిన ఆ పథకాన్ని ఇప్పటికీ అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలూ, అన్ని ప్రభుత్వాలు పోటీపడిమరీ ఆ పథకాన్ని కొనసాగిస్తాయనే విషయాన్ని మరోసారి గుర్తుచేసే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ ఫుల్ హ్యాపీ అయ్యింది.
అనంతరం చంద్రబాబు పేరు చెప్పకుండా ఒక ప్రస్థావన తీసుకొచ్చారు కేటీఆర్. హైదరబాద్ ని తానే కట్టినా అని చెప్పుకునే ఒక నాయకుడికి.. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఒక రోగికీ మధ్య జరిగిన సంభాషణను క్లియర్ గా చెప్పారు. దీంతో సభంతా నవ్వులు పూయగా… ఈ వీడియో బైట్ ని షేర్ చేస్తూ వైసీపీ ఖుషీ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
హైదరాబాద్ ని తానే అభివృద్ధి చేశానని చెప్పుకునే ఓ పెద్దమనిషి గతంలో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారని.. ఆయన ఓసారి ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లినప్పుడు చిన్న సంఘటన జరిగిందని మెల్లగా మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్. ఆ సమయంలో ఎదురుగా వస్తోన్న ఒక పేషెంట్ ని ఆపి… తనను గుర్తు పట్టావా అని అడిగారంట. అందుకు ఆ ఎర్రగడా ఆసుపత్రిలోని పేషెట్… గుర్తుపట్టలేదని చెప్పాడంట.
దీంతో హర్ట్ అయిన ఆ నాయకుడు… హైదరాబాద్ ని తానే నిర్మించానంటూ అక్కడున్న ఓ వ్యక్తితో చెప్పాడట. దీంతో ఎర్రగడ్డ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆ వ్యక్తి… గతంలో తనకు కూడా ఇలాంటి ఆలోచనలే వచ్చేవని, విశాఖకు సముద్రం తానే తెచ్చానని చెప్పుకునేవాడినని.. అయితే ఎర్రగడ్డ ఆస్పత్రిలో మందులు వాడాక కాస్త నయమవుతుందని ఆ వ్యక్తి బదులిచ్చాడని కేటీఆర్ వివరించారు.
ఆ కథ చెప్పి అప్పటి ముఖ్యమంత్రి పరువు తీశారు కేటీఆర్. అయితే కేటీఆర్, ఆ ముఖ్యమంత్రి పేరు మాత్రం చెప్పలేదు. చెప్పకపోయినా సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మారుమోగిపోతుండటం గమనార్హం. ఇలా వైఎస్సార్ ని గుర్తు చేయడంతోపాటు, చంద్రబాబుపై సెటైర్లు వేయడంతో వైసీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.