Mangalavaram Movie Review : కనిపించేది ఏది నిజం కాదు

Mangalavaram Movie Review

Mangalavaram Movie Review – మనిషిలో నమ్మకం పోతే దాని తోడుగా భయం, నీతి, నిజాయితీ కూడా పోయి విశృంఖలత్వం వచ్చి చేరుతుంది. పైకి కనపడేది ఏది నిజం కాదు , లోపల ఇంకో ఆలోచన ఉంటుంది , అది మనిషిని మనిషిలా ఉండనిస్తేనే మనిషి మంచోడిలా కనిపిస్తాడు , లేదంటే మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.

మనిషిలో మృగాన్ని ప్రశ్నించటం పనిగా చేసుకున్నాడా అనిపిస్తోంది అజయ్ భూపతి. ఈ వారం , అతని మంగళవారం చిత్రం విడుదల అయింది. మరి ఆ చిత్రం విశేషాలు ఏంటో తెలియాలంటే … మరి కొంత సమయం కేటాయించాల్సిందే …

కథ :
ఆ ఊరిలో ప్రతి మంగళవారం జంటల ఆత్మ హత్యలు అవుతున్నాయి … అది కూడా అందరికీ తెలిసేలా వారి జీవితాలలో రహస్యాలని గోడమీదకి ఎక్కించి మరీ … ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు … శైలజ (పాయల్ రాజపుట్) కి ఆ హత్యల వంటి ఆత్మహత్యలకి ఏం సంబంధం .. అసలు శైలజ ఎవరు … తన వేదన ఏంటి … అనేదే కథ ..

దర్శకుడు :
Mangalavaram Movie Review – అజయ్ భూపతి రాసుకున్న కథ చాల బాగుంది , కథనమే కాస్త తడపడింది , ప్రథమార్ధం లో వచ్చిన కొన్ని సన్నివేశాలు అసలు కధలో ఎందుకు ఉన్నాయో అర్ధం అవ్వలేదు … ముఖ్యంగా వూరి వాళ్ళ మధ్య గొడవ సన్నివేశం చాల సేపు ఉండి మనకి విసుగుతెప్పించింది … ద్వితీయార్ధం మాత్రం చాల బాగుంది , ముఖ్యంగా మలుపులు అన్ని చివరి ఇరవై నిమిషాల వరకు ఎవరికీ అంతు చిక్కకుండా రాసిన తీరు చాల బాగుంది…

చిత్రం నిడివిలో మచ్చ ఏదైనా ఉంటె అది ప్రథమార్ధమే … సుమారు గంట పాటు హీరోయిన్ చిత్రం లో కనపడకుండా ఉండటం , పైగా ఆ సంభాషణలు కాస్త కుటుంబ ప్రేక్షకులకి ఇబ్బంది పెట్టె అంశం … పైగా అక్కర్లేని సన్నివేశాలు , వెరసి ప్రథమార్ధం ప్రేక్షకుడి ఓర్పుకి పరీక్ష అనే చెప్పాలి .. .శైలజ వేదన చెప్పే సన్నివేశాలను చాల బాగా చిత్రీకరించాడు అజయ్.

పాయల్ రాజపుట్ :
శైలాజ గా పాయల్ చాల బాగా నటించింది , అజయ్ పెట్టుకున్న నమ్మకాన్ని తాను పూర్తిగా న్యాయం చేసేలా చూసింది … తన బాధని ఎవరికీ చెప్పుకోలేక , దిక్కు తోచని స్థితిని ఎంతో హృద్యంగా చూపించింది పాయల్ … తాను కనిపించిన తరవాత చిత్రం లో అంతా తానే అయి ముందుకు తీసుకెళ్లింది కధని .. చాల పరిణితి కలిగిన నటన కనబర్చింది … de glamor గా కనిపిస్తూనే గ్లామర్ గా కూడా కనపడచ్చు అని చూపించింది.

ఇతర తారాగణం :
దివ్య పిళ్ళై, చైతన్య కృష్ణ , అజ్మల్ అజ్మీర్, వారి వారి పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు … దివ్య పిళ్ళై చాల ముఖ్య పాత్ర పోషించింది చిత్రంలో. రవీంద్ర విజయ్ డాక్టర్ గా బాగా చేసారు. అజయ్ ఘోష్ పాత్ర హాస్యం కోసం ఉన్నట్టు ఉంది, ఇంకా బాగా చేసే అవకాశం ఉంది , మరి ఎందుకో అంత మేర లేదు అనే చెప్పాలి. నందిత శ్వేతా పోలీస్ ఇన్స్పెక్టర్ గా బాగానే చేసింది అని చెప్పాలి. చిత్రం లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, అది చిత్రం చూస్తేనే తెలుస్తుంది.

సంగీతం , కెమెరా :
శివేంద్ర దాశరధి, కెమెరా పనితనం బాగుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం పర్లేదు అని చెప్పాలి పాటల విషయంలో, కానీ బ్యాక్ గ్రౌండ్ సినిమాకి చాల పెద్ద plus అయింది , థ్రిల్లర్ genre కి సరైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోస్తుంది , అదే అజనీష్ మ్యూజిక్ చేసింది.

మొత్తానికి ఎందుకు చూడాలి:
పాయల్ రాజపుట్ నటన కోసం చూడాలి . చూసి తీరాలి …హీరో లేని చిత్రం లో తన కథనే హీరో గ చేసిన అజయ్ తీరు కోసం చూడాలి …మంగళవారం చిత్రం , మనిషి లో ద్వంద్వ ప్రవృత్తిని ప్రశ్నిస్తుంది , పైకి కనిపించే మంచి కాదు, లోపల దాగున్న చెడు ని గుర్తించమంటుంది…మానసిక రుగ్మత కన్నా మనిషి లో దాగున్న మృగత్వమే భయంకరం అని చెప్తుంది.

మంగళవారం మూవీ రివ్యూ రేటింగ్:
చిత్రం లో ఎన్నో logic ల కి సమాధానాలు లేకపోవటం , ప్రథమార్ధం కాస్త బోర్ కొట్టటం వల్ల మా రేటింగ్ 2.5/5

‘ఆర్ ఎక్స్ 100’ డైరక్టర్ కి కాలి..ఆ మాట అనేసాడు

సిద్ధార్థ్, అదితి రిలేషన్ కి నేనా కారణం అంటున్న మంగళవారం దర్శకుడు