సిద్ధార్థ్, అదితి రిలేషన్ కి నేనా కారణం అంటున్న ‘మంగళవారం’ దర్శకుడు 

తమిళ సినిమా దగ్గర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సిద్ధార్థ్ కూడా ఒకడు. ఒకప్పుడు తెలుగు సినిమాలో అయితే అమ్మాయిలకి లవర్ బాయ్ లా మంచి ఫాలోయింగ్ ఉన్న తాను మెల్లగా అయితే టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయ్యాడు. కాగా సిద్ధార్థ్ పర్శనల్ లైఫ్ కోసం చాలా మందికి కొని విషయాలు తెలిసిందే.

అప్పటికే కొందరు యంగ్ హీరోయిన్స్ తో డేటింగ్ చేయడంతో వారితో విడిపోవడం ఇవన్నీ అంతా చూసేసారు. కానీ గత కొన్నాళ్ల నుంచి మరో యంగ్ బ్యూటీ అదితి రావు హైదరి తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే ఇద్దరూ కూడా అనేక చోట్ల చాలా క్లోజ్ గా కనిపించడం ఆ వార్తలను కూడా ఖండించకపోవడంతో అయితే ఇద్దరి మధ్యా ఏదో నడుస్తున్నట్టే అంతా అనుకున్నారు.

అయితే ఇది అంతా అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రం “మహా సముద్రం” నుంచి అని చెప్పాలి. ఈ సినిమా అంతలా ఆడకపోయినా సిద్ధార్థ్, అదితి లకి మాత్రం బాగానే వర్కౌట్ అయ్యింది అనే టాక్ ఉంటుంది. కాగా ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.

అదితి బర్త్ డే లో సిద్ధార్థ్ కనిపించడం ఇద్దరూ చాలా క్లోజ్ గా ఓ సెల్ఫీ తీసుకోవడం మళ్ళీ మంచి టాపిక్ గా మారింది. అయితే దీనంతటికీ కారణం నేను అని అంతా అంటున్నారు కానీ అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ తాను పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. అయితే దీనికి కామెంట్స్ నీ సినిమా వల్లే అయ్యిందే కానీ చాలా మంది అంటున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఈ దర్శకుడు తెరకెక్కించిన “మంగళవారం” సినిమా ఈ డిసెంబర్ రిలీజ్ కి సిద్ధం గా ఉంది. 
hiphttps://twitter.com/DirAjayBhupathi/status/1718314712331694558