‘గ్రేటర్ మేయర్‌గిరీని మజ్లిస్‌కి కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్ కుట్ర..’ అని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి మజ్లిస్ పార్టీతో బీజేపీ లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుందన్న వాదన కాంగ్రెస్ నుంచి వినిపిస్తోంది. ఇంతకీ, మజ్లిస్ – టీఆర్‌ఎస్ మధ్య పొత్తు వుందా.? లేదా.? ఈ విషయమై పొలిటికల్ రచ్చ పీక్స్‌కి చేరిపోయింది. దాంతో, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టతనిచ్చేశారు. టీఆర్‌ఎస్‌తో తమకు పొత్తు లేదని తేల్చేశారు. టీఆర్‌ఎస్ ఇప్పటికే ఈ విషయమై స్పష్టత ఇచ్చింది.
మజ్లిస్ లేని టీఆర్‌ఎస్‌ని ఊహించగలమా.?
మజ్లిస్ పార్టీ, బయట నుంచి టీఆర్‌ఎస్‌కి మద్దతిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మజ్లిస్‌కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, టీఆర్‌ఎస్ ‘జీ హుజూర్’ అంటోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా మజ్లిస్ వైఖరి దాదాపుగా ఇలానే వుంటుంది.. ఆయా పార్టీలు, మజ్లిస్‌తో స్నేహం ఖచ్చితంగా నడిపి తీరాల్సిందే. అలాంటిది, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి మజ్లిస్ మద్దతు లేదంటే ఎలా నమ్మగలం.? కానీ, పైకి ఆ స్నేహం గురించి గట్టిగా చెప్పుకోలేని దయనీయ స్థితి ఈ రెండు పార్టీలదీ. గ్రేటర్ ఓటరు అన్నిటినీ గమనిస్తున్నాడనుకోండి.. అది వేరే సంగతి.
సిల్లీ ఫైట్.. గల్లీ మార్క్ విమర్శలు..
‘కేటీఆర్‌కి రాజకీయం కొత్త.. మజ్లిస్ ఎన్నో పార్టీల్ని చూసేసింది.. మేం తలచుకుంటే రెండు నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..’ అంటూ మజ్లిస్ ఎమ్మెల్యే తాజాగా ఈ రోజు హెచ్చరికలు పంపారు. ‘ఛల్.. మీ పార్టీ ఎంత.? మీ సత్తా ఎంత.? టీఆర్‌ఎస్ జోలికొస్తే ఖబడ్దార్..’ అంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఎదురుదాడికి దిగారు. ఇదంతా నిజమనుకునేరు? ఏదో, జస్ట్ అలా సరదాకి.. తిట్టుకున్నారంతే. గ్రేటర్ ఎన్నికల వ్యూహానికి కేసీఆర్, ఒవైసీతో కలిసి స్కెచ్ వేశాక.. రెండు పార్టీల మధ్యా గొడవ వుంటుందని ఎలా అనుకోగలం.?
బీజేపీ కొత్త పల్లవి.. అందరూ సమానమే.!
బీజేపీ కొత్త పల్లవి.. అందరూ సమానమే.!